ETV Bharat / state

నేను రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని- బీసీల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ - TPCC Chief Mahesh Kumar Goud On BCs

author img

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

TPCC Chief Mahesh Kumar Goud On BC Survey : నేను రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బీసీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్, బీజేపీలకు లేదని ఆక్షేపించారు. తన కార్యవర్గంలో 60 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశం కల్పిస్తానని వెల్లడించారు. బీసీ కులగణన జరిగిన తరువాతనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని కోరినట్లు తెలిపారు.

TPCC Chief Mahesh Kumar Goud On BC Survey
TPCC Chief Mahesh Kumar Goud On BC Survey (ETV Bharat)

TPCC Chief Mahesh Kumar Goud On BC Survey : బీసీల విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​ గౌడ్​ తెలిపారు. తన కార్యవర్గంలో 60 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో కొత్తగా ఎన్నికైన పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌ గౌడ్‌కు ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా మహేశ్​కుమార్​ గౌడ్​ మాట్లాడారు.

రాహుల్ వదిలిన బీసీ బాణాన్ని : బీఆర్‌ఎస్‌ బీసీల కులగణన గురించి చేస్తున్న విమర్శలను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​ గౌడ్​ తిప్పి కొట్టారు. బీసీల గురించి మాట్లాడే హక్కు ఆ రెండు పార్టీలకు(బీఆర్ఎస్, బీజేపీ) లేదని మహేశ్ కుమార్ గౌడ్ ఆక్షేపించారు. తాను రాహుల్ గాంధీ వదిలిన బీసీ బాణాన్ని అని వెల్లడించారు. ఉత్తర భారత్​లో అగ్రవర్ణాలకు ధీటుగా కులగణన జరగాలని, దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీలకు న్యాయం జరగాలని 'భారత్ జోడో యాత్ర' నుంచి చాటుతున్న మహానుబావుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు. అందుకే ఆయనను చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తనను ఒక ధ్యేయంతో పీసీసీ అధ్యక్షుడిగా చేశారని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. అధిష్ఠానం కోరిన విధంగా ముందుకు పోవాలన్న తపన తనలో ఉందని స్పష్టం చేశారు. పార్టీలో పొన్నం ప్రభాకర్, కేశవరావు, వీహెచ్ లాంటి వారు ఎందరో బీసీల కోసం కొట్లాడుతున్నారని చెప్పారు. ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయినా కూడా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ తనతో చదివించారని పేర్కొన్న మహేశ్ కుమార్‌ గౌడ్‌ అది రేవంత్ రెడ్డి కమిట్మేంట్​ అని కొనియాడారు. రేవంత్ రెడ్డి , తాను, పొన్నం ప్రభాకర్ అంతా రాహుల్ గాంధీ సైనికులమేనని వెల్లడించారు.

బీసీ కులగణన హస్తం పార్టీ పేటెంట్ : బీసీ కులగణన కాంగ్రెస్ పేటెంట్ అన్న మహేశ్ కుమార్‌ గౌడ్‌ ఈ విషయంలో బీఆర్‌ఎస్‌, బీజేపీలకు మాట్లాడే అర్హత లేదన్నారు. పీసీసీ అధ్యక్షుడి ఎంపికకు కసరత్తు జరుగుతున్న సమయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క, మధుయాస్కీ, లక్ష్మణ్‌కుమార్‌, బలరాం నాయక్‌ల పేర్లు వినిపించాయని అందరూ అర్హులేన్న ఆయన ఎవరికి ఎక్కడ ఏవిధంగా ఉపయోగించుకోవాలన్నది పార్టీ అధిష్ఠానానికి బాగా తెలుసన్నారు. బీసీ కులగణన జరిగిన తరువాతనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని కోరినట్లు తెలిపారు.

బీఆర్ఎస్ అధికారంలోకి రావడం కల : రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే కేటీఆర్ తీస్తామంటున్నారని ఇక బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం కల అని ఎద్దేవా చేశారు. పదేళ్ల పాలనలో తెలంగాణ తల్లి ఎందుకు గుర్తు రాలేదని నిలదీశారు. బీసీల రిజర్వేషన్లు తగ్గించింది బీఆర్‌ఎస్‌ కాదా అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు తర్వాత బీజేపీతో లోపాయికారీ ఒప్పందం పెట్టుకున్నది వాస్తవం కాదా? అని నిలదీశారు. బడుగుల మద్దతుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న ఆయన వారిని గుండెల్లో పెట్టుకొని వారు కన్న కలలు నిజం చేస్తూ ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. కులాలు పక్కన పెట్టి బీసీలు అంతా ఐక్యంగా ముందుకు పోదామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్యేలు, కమిషన్‌ ఛైర్మన్లు, పలువురు సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.

పీసీసీ కార్యవర్గం కూర్పుపై చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్‌ ఫోకస్ - నేడు ఏఐసీసీ ఇంఛార్జి కార్యదర్శులతో సమావేశం - AICC Focus on PCC New Members

సర్దార్ వల్లభ్​భాయ్ పటేల్​తో బీజేపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు : మహేశ్ కుమార్ గౌడ్ - PCC Chief Comments On BJP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.