Indians In Russia Army: రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను విడుదల చేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇరు దేశాధినేతలు భేటీలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన ప్రైవేట్ విందులో భారతీయుల విషయాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇందుకు అంగీకరించిన పుతిన్, వారిని విధుల నుంచి వెనక్కి రప్పించి, స్వదేశానికి పంపిస్తామని హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
మోదీతో విందులో పుతిన్ కీలక నిర్ణయం- రష్యా సైన్యంలోని భారతీయులకు విముక్తి!
Indians In Russia Army (Associated Press)
Published : Jul 9, 2024, 10:38 AM IST
ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో భారత్ నుంచి వెళ్లిన సుమారు 50 మంది యువకులను రష్యా తన సైన్యంలో చేర్చుకుంది. ఈ క్రమంలో నలుగురు భారతీయులు మృతిచెందారు. తమను మోసం చేసి సైన్యంలో చేర్చారని వారు ఆరోపిస్తున్నారు. తమను సైన్యం నుంచి విడిపించి స్వదేశానికి తీసుకెళ్లాలని కొంత కాలంగా వారు వేడుకుంటున్నారు.