Spain Floods Death Toll : స్పెయిన్‌లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సృష్టించిన విలయానికి ఇప్పటివరకు 158 మంది మృతిచెందారు. అనేక మంది ఆచూకీ గల్లంతైంది. కేవలం వాలెన్సియాలోనే 155 మంది చనిపోయినట్లు గుర్తించారు. జల దిగ్బంధంలో చిక్కుకున్న గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజల్ని రక్షించేందుకు స్పెయిన్ అత్యవసర ప్రతిస్పందన విభాగానికి చెందిన 1,000 మంది సైనికులు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టారు. భవనాలు, కార్లపై చిక్కుకున్న పౌరులను హెలికాప్టర్‌లతో ఎయిర్ లిఫ్ట్ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నదులను తలపిస్తున్న రహదారులపై వందలాది వాహనాలు కొట్టుకుపోయిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. గల్లంతైన వారి అచూకీ తెలిస్తే మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ హెలికాప్టర్‌ల సాయంతో 70 మందిని రక్షించినట్లు వెల్లడించారు. ఈ శతాబ్దంలో స్పెయిన్‌ను తాకిన అత్యంత ఘోరమైన ప్రకృతి విపత్తుగా తాజా వరదలను శాస్త్రవేత్తలు పరిగణిస్తున్నారు.
స్పెయిన్‌లో వరద బీభత్సం - 158 మంది మృతి!
Published : Nov 1, 2024, 6:56 AM IST