ETV Bharat / spiritual

యమ ద్వితీయ రోజు ఈ పూజ చేస్తే - తిరుగులేని సంపద, భోగభాగ్యాలు లభిస్తాయట! - HOW TO DO LAXMI KUBERA PUJA AT HOME

-భగినీ హస్త భోజనం వెనుక ఉన్న పురాణ గాథ ఇదే -భోగభాగ్యాలను అందించే లక్ష్మీ కుబేర పూజ

How to Do Laxmi Kubera Puja at Home
How to Do Laxmi Kubera Puja at Home (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 2, 2024, 11:13 AM IST

How to Do Laxmi Kubera Puja at Home: పరమ పవిత్రమైన కార్తికమాసం మొదలైంది. ఈ నెలంతా భక్తులు పూజలు చేస్తూ, ఉపవాసాలు ఉంటూ శివనామాన్ని జపిస్తుంటారు. శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఇక ఈ కార్తిక మాసంలో ప్రతిరోజూ విశిష్టమైనదే. అయితే యమ ద్వితీయ కూడా ప్రత్యేకమైనదని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్​ కుమార్​ చెబుతున్నారు. మరి అది ఎప్పుడు వచ్చింది? ఆరోజు ఏం చేయాలి? అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

యమ ద్వితీయ ఎప్పుడు: కార్తిక మాసంలో శుక్ల పక్షంలో వచ్చే విదియ తిథిని యమ ద్వితీయ అనే పేరుతో పిలుస్తారని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్​ కుమార్​ చెబుతున్నారు. 2024లో యమ ద్వితీయ నవంబర్​ 3వ తేదీ ఆదివారం వచ్చిందని.. ఈ రోజున భగినీ హస్త భోజనంతో పాటు అక్షయ లక్ష్మీ కుబేర పూజ నిర్వహించాలని చెబుతున్నారు.

భగినీ హస్త భోజనం రోజు ఏం చేయాలి: భగినీ అంటే సోదరి. ఆమె తన స్వహస్తాలతో పెట్టే భోజనాన్ని భగినీ హస్త భోజనం అంటారని అంటున్నారు. ఈ రోజు ఏం చేయాలంటే..

  • సోదరులందరూ తమ సోదరిమణుల ఇంటికి వెళ్లాలి.
  • ఇంటికి వచ్చిన తన అన్నా లేదా తమ్ముళ్లకు సోదరి నుదిటిన తిలకం దిద్దాలి.
  • ఆ తర్వాత తన వండిన వంటను సోదరులకు వడ్డించాలి.
  • సోదరి చేతి వంటను తిన్నా సోదరులు ఆమెకు చీరను సారెగా పెట్టాలి.

భగినీ హస్త భోజనం వెనుక ఉన్న పురాణ గాథ: అల్పాయుష్కుడైనా మార్కండేయుడు.. యమధర్మరాజు విసిరిన యమపాశం నుంచి తప్పించుకునేందుకు పరమేశ్వరుడిని ఆలింగనం చేసుకుంటాడు. ఈ క్రమంలో ఆ యమపాశం వెళ్లి శివలింగాన్ని తాకుతుంది. దీంతో ఆగ్రిహించిన శివుడు.. యమధర్మరాజుపై తన త్రిశూలాన్ని విసురుతాడు. త్రిశూలం శక్తి ఎంతటిదో తెలిసిన యముడు దాని ధాటి నుంచి తప్పించుకోవటానికి పరుగెత్తి పరుగెత్తి చివరకు అనుకోకుండా తన చెల్లెలు యమున ఇంటికి వెళ్లి తలదాచుకుంటాడు. ఎన్నిసార్లు పిలిచినా రాని అన్న ఇలా అకస్మాత్తుగా తన ఇంటికి రావడంతో ఆనందంతో యమున ఉబ్బితబ్బిబైపోతుంది. అతనికి సకల మర్యాదలు చేస్తుంది. అన్నకు ఇష్టమైన భోజనం వడ్డిస్తుంది యమున. దీంతో భోజనం చేసేవారిని సంహరించరాదని శివుని ఆజ్ఞ మేరకు త్రిశూలం వెనక్కి వెళ్లిపోతుంది. త్రిశూలం నుంచి రక్షణ కల్పించి, తన కోసం చెల్లెలు చేసిన అతిథి మర్యాదలకు ముగ్ధుడయిన యముడు.. "కార్తీక శుక్ల విదియ రోజు సోదరి ఇంటికి వెళ్లి, ఆమె చేతి వంట తినే సోదరుడి గృహంలో అపమృత్యు దోషాలు ఉండవు. దీర్ఘాయుష్షు కలగుతుంది" అని తన చెల్లెలు యమునకు వివరిస్తాడు.

అక్షయ లక్ష్మీ కుబేర పూజ: భగినీ హస్త భోజనంతో పాటు యమ ద్వితీయ రోజు మరో ప్రత్యేకత ఉందని మాచిరాజు చెబుతున్నారు. అదేంటంటే.. లక్ష్మీదేవి తన దగ్గర ఉన్న సంపాదనంతా కుబేరుడికి ఇచ్చి హరి భక్తిలో లీనమైపోయిన రోజట. అందువల్ల ఈ రోజున ఎవరైతే గృహంలో లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని పూజిస్తారో వారికి తిరుగులేని సంపద, భోగభాగ్యాలు లభిస్తాయని వివరిస్తున్నారు. మరి ఆ పూజ ఎలా చేయాలంటే..

  • ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి.
  • ఆ తర్వాత పూజ మందిరాన్ని అలంకరించుకోవాలి.
  • ఆ తర్వాత అందులో లక్ష్మీ కుబేర చిత్ర పటాన్ని ఏర్పరచుకోవాలి.
  • ఆ ఫొటోకు గంధం, కుంకుమ బొట్లు పెట్టి అక్కడ దీపాన్ని వెలిగించాలి.
  • అనంతరం ఆ చిత్రపటం వద్ద అరిటాకు పెట్టి అందులో నవధాన్యాలు పోయాలి.
  • నవధాన్యాల మీద తమలపాకు పెట్టి అందులో హరిద్రా గణపతిని(పసుపు ముద్ద) ఉంచి గణపతి షోడచనామాలతో పసుపు వినాయకుడిని పూజించాలి.
  • ఆ తర్వాత రాగి చెంబును నవధాన్యాల మీద ఉంచండి.
  • లక్ష్మీ కుబేర చిత్ర పటం వద్ద రూపాయి నాణెలు ఉంచి, రకరకాల పుష్పాలతో చిత్రపటానికి పూజ చేస్తూ "ఓం ధనద సౌభాగ్య లక్ష్మీ కుబేర వైశ్రవణాయ మమకార్య సిద్ధిమ్మ్ కురు స్వాహా" అనే మంత్రాన్ని 21 సార్లు చదువుతూ పూలతో పూజ చేయాలి.
  • ఆ తర్వాత వివిధ రకాల పండ్లను నైవేద్యంగా సమర్పించాలి.
  • ఆ తర్వాత పండ్లను తాంబూలంలో ఉంచి ముత్తైదువలకు వాయనంగా ఇవ్వండి.

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

కార్తీక మాసంలో ఫాస్టింగ్ అత్యంత మంచిది! అసలు ఉపవాసమంటే ఏంటి? ఎలా చేయాలి?

కార్తీక మహత్యం చెప్పాలని వశిష్ఠుని కోరిన జనకుడు- విష్ణుపూజ, దీపారాధన ఇలా చేయాలంట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.