ETV Bharat / health

ఈ పథ్యాహారం - మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలట! - ఎలా తీసుకోవాలో తెలుసా? - WOMEN HEALTH PROBLEMS REDUCING FOOD

-పలు కారణాల చేత ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలు -ఈ పథ్యాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారట!

Women Health
Ayurvedic Remedy to Reduce Women Health Problems (ETV Bharat)
author img

By ETV Bharat Health Team

Published : Nov 2, 2024, 2:01 PM IST

Ayurvedic Remedy to Reduce Women Health Problems: కుటుంబ బాధ్యత, ఆఫీస్ పని.. ఇలా కారణాలు ఏవైతేనేమి.. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఇంటాబయట పనులతో ఫుల్ బిజీగా ఉంటారు మహిళలు. ఈ కారణంగా తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తారు. తినే తిండే, తాగే నీటిపై అంతగా శ్రద్ధ తీసుకోరు. ఫలితంగా అది మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా నెలసరి, సంతానలేమి, గర్భాశయ ఇన్ఫెక్షన్లు.. వంటివన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ సమస్యలు రాకుండా ఉండాలన్నా మహిళలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆయుర్వేదం ప్రకారం ఓ పథ్యాహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేదిక్​ కన్సల్టెంట్​ డాక్టర్​ గాయత్రీ దేవీ. మరి అది ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం..

కావాల్సిన పదార్థాలు:

  • విదారీ రసం - 100 ml
  • చెరకు రసం -100 ml
  • ఆవు పాలు - 100 ml
  • నెయ్యి - 100 గ్రాములు
  • ఎండు ఖర్జూరాల పొడి - 20 గ్రాములు
  • తానికాయ పొడి - 20 గ్రాములు
  • పిప్పళ్ల పొడి - 20 గ్రాములు
  • యష్టి మధు చూర్ణం - 20 గ్రాములు
  • చక్కెర - 200 గ్రాములు

తయారీ విధానం:

  • ముందుగా ఓ గిన్నె తీసుకుని అందులోకి విదారీ రసం, చెరుకు రసం, ఆవుపాలు, ఎండు ఖర్జూరాల పొడి, తానికాయ పొడి, యష్టి మధు చూర్ణం, పిప్పళ్ల పొడి, చక్కెర వేసి బాగా కలపాలి.
  • చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత ఈ గిన్నెను స్టవ్​ మీద పెట్టి మంటను సిమ్​లో పెట్టి మరిగించుకోవాలి.
  • ఈ మిశ్రమం మరుగుతున్నప్పుడు ఆవు నెయ్యి వేసుకుని కలపాలి. ఆవు నెయ్యి కరిగి మిశ్రమం కాస్త దగ్గరపడుతున్నప్పుడు దింపి వేరే బౌల్​లోకి తీసుకోవాలి.
  • చల్లారిన తర్వాత దీనిని ఓ గాజు జార్​లో స్టోర్​ చేసుకోవాలి. ఇలా ఒక్కసారి చేసుకుంటే నెలరోజుల పాటు నిల్వ ఉంటుంది.

ఎలా తీసుకోవాలి: ఈ పథ్యాహారాన్ని ప్రతిరోజూ ఒకసారి పరగడుపున ఒక అరకప్పు వేడి పాలు లేదా వేడి నీళ్లలో 1 చెంచా కలిపి తీసుకోవాలని చెబుతున్నారు.

ప్రయోజనాలు:

  • విదారీరసం: ఈ విదారీ అనేది మహిళల్లో ఉండే వివిధ రకాల అనారోగ్య సమస్యలు తగ్గించడానికి ఉపయోగపడుతుందని ప్రముఖ ఆయుర్వేదిక్​ కన్సల్టెంట్​ డాక్టర్​ గాయత్రీ దేవీ చెబుతున్నారు. ముఖ్యంగా గర్భాశయానికి టానిక్​లా పనిచేసి హర్మోన్ల సమస్యలు, నెలసరి సమస్యలు తగ్గించడానికి సహాయపడుతుందని అంటున్నారు.
  • చెరుకు రసం: నెలసరి సమయంలో అతిగా బ్లీడింగ్​ అవుతుంటే.. ఆ సమస్యను తగ్గించే గుణం చెరుకు రసానికి ఉందని వివరిస్తున్నారు.
  • ఆవుపాలు: ఆవు పాలలోని పోషకాలు.. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయని చెబుతున్నారు.
  • ఎండు ఖర్జూరాలు: వీటిలో ఐరన్​, క్యాల్షియం వంటి పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా కాల్షియం, ఐరన్​ తక్కువ ఉన్న మహిళలకు ఇది ఎంతగానో తోడ్పడుతుందని చెబుతున్నారు.
  • తానికాయ: గర్భాశయంలో ఉన్న ఇన్ఫెక్షన్లను తానికాయ తగ్గిస్తుందని చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఈ ఆహారాలను కలిపి తింటే "బరువు" పెరుగుతారు జాగ్రత్త! - నిపుణులు సూచిస్తున్న ఆ ఫుడ్ కాంబినేషన్స్ ఇవే!

పీసీఓఎస్​తో బాధపడుతున్నారా? మందులతో పూర్తిగా తగ్గదట! - ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఈజీగా చెక్ పెట్టొచ్చట!!

థైరాయిడ్ కారణంగా జుట్టు విపరీతంగా రాలుతుందా? - ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఈజీగా తగ్గించుకోవచ్చట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.