తెలంగాణ

telangana

SIIMA 2024 అవార్డ్స్‌ నామినేషన్‌ - నాని, రజనీకాంత్ సినిమాల హవా

By ETV Bharat Telugu Team

Published : Jul 16, 2024, 2:40 PM IST

source ANI
SIIMA 2024 Awards Nominations (source ANI)

SIIMA 2024 Awards Nominations : సౌత్ ఫిల్మ్​ ఇండస్ట్రీకు చెందిన సినిమాలు, యాక్టర్స్, టెక్నిషియన్స్​ టాలెంట్​ను గుర్తించి ఇచ్చే ప్రతిష్ఠాత్మక అవార్డులు సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌(సైమా). ఈ ఏడాది సెప్టెంబరు 14, 15 తేదీల్లో దుబాయ్ వేదికగా ఈ 12వ ఎడిషన్‌ వేడుకలు జరగనున్నాయి. అయితే తాజాగా ఈ పురస్కారాల కోసం పోటీ పడుతున్న సినిమాల జాబితాను సైమా విడుదల చేసింది. అత్యధికంగా 11 విభాగాల్లో తెలుగు నుంచి నాని దసరా, తమిళం నుంచి రజనీకాంత్‌ జైలర్‌ నామినేట్‌ అయ్యాయి. ఇక మలయాళం నుంచి టొవినో థామస్‌ 2018, కన్నడ నుంచి దర్శన్‌ కాటేర 8 విభాగాల్లో పోటీ పడుతున్నాయి. కాగా, ఈ నాలుగు చిత్రాలు కూడా అటు కథ పరంగా, ఇటు కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్​ ముందు బ్లాక్ బ్లస్టర్​ హిట్​గా నిలిచాయి. ఆడియెన్స్ ఈ చిత్రాలకు విపరీతంగా కనెక్ట్ అయిపోయారు.

ABOUT THE AUTHOR

...view details