IIND vs BAN Test 2024: భారత్ - బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా ఆల్‌రౌండర్ శతకం (102 పరుగులు)తో అదరగొట్టాడు. అతడు 108 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇందులో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. దీంతో అశ్విన్ తన అశ్విన్ టెస్టు కెరీర్లో 6వ శతకం పూర్తి చేశాడు. మరోవైపు జడేజా (86 పరుగులు; 10x4 , 2x6) కూడా బాధ్యాతాయుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇక తొలి రోజు ఆట ముగిసేసరికి భారత్ 339-6 (80 ఓవర్లు) స్కోర్‌తో పటిష్ఠ స్థితికి చేరుకుంది. క్రీజులో అశ్విన్, జడేజా ఉన్నారు.
ఆదుకున్న అశ్విన్, జడ్డూ
144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన కష్టాల్లో పడ్డ టీమ్ఇండియాను జడేజా, అశ్విన్ ఆదుకున్నారు. స్కోర్ 200 అయినా దాటుతుందా అన్న దశలో నుంచి భారత్‌కు 300+ స్కోర్ అందించారు. వీరిద్దరూ వీరిద్దరూ 7వ వికెట్‌కు భారీ 195 పరుగులు అజేయ భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌కు భారీ స్కోర్ అందించారు. రోహిత్, గిల్, విరాట్ లాంటి స్టార్లు ఈ పిచ్‌పై పరగులు చేయడానికి కష్టపడితే ఈ ఆల్‌రౌండర్లు భారీ స్కోర్లతో బంగ్లా బౌలర్లకు ఎదురు నిలిచారు. ఎలాంటి ప్రయోగాత్మక షాట్లకు పోకుండా నిలకడతా ఆడారు. ఈ క్రమంలోనే అశ్విన్ శతకం పూర్తి చేశాడు. కాగా, తన హోం గ్రౌండ్ చెపాక్‌లో అశ్విన్‌కు ఇది రెండో టెస్టు సెంచరీ.
Ravi Ashwin - an icon for India. 🇮🇳
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 19, 2024
- Build a statue for the greatest ever from Tamil Nadu. 🐐 pic.twitter.com/Brd7DWD1sE
టాపార్డర్ ఫెయిల్
ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ (6), విరాట్ కోహ్లీ (6) విఫలమయ్యారు. యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (0) పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఈ ముగ్గురిని 24ఏళ్ల పేసర్ మహ్మద్ హసన్ ఔట్ చేశాడు. దీంతో భారత్ 34 పరుగులకే టాపార్డర్ కుప్పకూలింది. ఈ దశలో ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ (56 పరుగులు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. రిషబ్ పంత్ (39 పరుగులు)తో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఇక కే ఎల్ రాహుల్ (16 పరుగులు) కూడా విఫలమయ్యాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహ్మద్ 4, నహీద్ రానా, మెహెదీ హసన్ మిరాజ్ తలో వికెట్ దక్కించుకున్నారు.
Magnificent CENTURY by @ashwinravi99 👏👏
— BCCI (@BCCI) September 19, 2024
This is his second Test century at his home ground and 6th overall.
Take a bow, Ash!
LIVE - https://t.co/jV4wK7BgV2…… #INDvBAN@IDFCFIRSTBank pic.twitter.com/VTvwRboSxx