ETV Bharat / state

తెలంగాణలో కొత్త రేషన్​ కార్డులు - ఆదాయం ఎంతలోపు ఉండాలి? - New Ration Card in Telangana - NEW RATION CARD IN TELANGANA

Rules and Regulations of New Ration Card : తెలంగాణలో కొత్త రేషన్​ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం వాటి విధి విధానాలను పరిశీలిస్తోంది. కుటుంబాల ఆదాయ పరిమితిని బట్టి కార్డులు ఇవ్వాలా లేదా అన్న యోచనలో ఉంది.

Rules and Regulations of New Ration Card in Telangana :
Rules and Regulations of New Ration Card in Telangana : (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 19, 2024, 4:46 PM IST

Rules and Regulations of New Ration Card in Telangana : రాష్ట్రంలో కొత్త రేషన్​కార్డుల జారీకి విధి విధానాలు రూపొందిస్తున్న మంత్రివర్గ ఉపసంఘం, ఆయా కుటుంబాల వార్షిక ఆదాయ పరిమితిని కూడా నిర్ణయించనుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో రెండు రకాల ఆదాయ పరిమితుల బట్టి రేషన్ ​కార్డులు జారీ చేశారు. కొత్త రేషన్​ కార్డులను ఇవ్వనున్న నేపథ్యంలో ఆదాయ పరిమితిని మార్చాలా, తగ్గించాలా, ఉన్నదాన్నే కొనసాగించాలా అన్నదానిపై కమిటీ కసరత్తు చేస్తోంది. దీనిపై పౌర సరఫరాల శాఖ కమిషనర్​ డీఎస్​ చౌహాన్ నేతృత్వంలో పలువురు అధికారులు గుజరాత్​, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల్లో అమలులో ఉన్న విధి విధానాలను అధ్యయనం చేశారు.

నివేదికలో పలు మార్పులు : ఆ నివేదికను ఉపసంఘానికి అందజేయగా, దానిపై చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో రేషన్​కార్డును ఒక్క పౌర సరఫరాల వస్తువులను తీసుకోవడానికే కాకుండా పలు సంక్షేమ పథకాల్లోనూ ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయ పరిమితి నిర్ధారణ విషయంలో కొత్త రేషన్​, హెల్త్​కార్డుల జారీపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం పలు మార్పులను చేయాలని యోచిస్తోంది. పరిమితిని తగ్గిస్తే ఎంత వరకు తగ్గించాలి, ఇప్పుడున్నట్లు కొనసాగిస్తే అర్బన్​ ఏరియాల్లోనే అదే పరిమితిని ఉంచాలా లేదా, లేక తగ్గించాలా, ఆదాయం వ్యత్యాసం ఉంటుంది కావున ఇలా అన్ని కోణాల్లో సంఘం తాజాగా చర్చించినట్లు తెలిపింది.

తెల్లరేషన్‌ కార్డుదారులకు గుడ్ న్యూస్ - జనవరి నుంచి సన్న బియ్యం - MINISTER UTTAM ON RATION RICE

తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ, అర్బన్​ ఏరియాలుగా వార్షికాదాయ పరిమితిని అమలు చేస్తున్నారు. దీని ఆధారంగానే తెల్ల రేషన్​కార్డును ప్రభుత్వాలు ఇస్తున్నాయి. గ్రామీణ ప్రాంతంలో రూ.1.50 లక్షలు, అర్బన్​ రూ.2 లక్షల్లోపు ఆదాయాన్ని కార్డుల జారీకీ ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. భూ విస్తీర్ణం తరి భూమి అయితే 3.5 ఎకరాలు, మాగాణి భూమి అయితే 7.5 ఎకరాలలోపు ఉండాలనే నిబంధనలు అమలు చేస్తున్నారు.

రాష్ట్రంలో 89.96 లక్షల మందికి రేషన్​ కార్డులుండగా, వాటి పరిధిలో 2.1 కోట్ల మంది సభ్యులున్నారు. వీటిలో 5.66 లక్షలు అంత్యోదయ, అన్నపూర్ణ పథకాల కింద 5,416 కార్డులు ఉన్నాయి. తెల్ల కార్డుదారులకు 6 కిలోల బియ్యం (కేంద్రం నుంచి 5 కిలోలు, రాష్ట్రం నుంచి 1 కిలో) ఇస్తున్నారు. అన్నపూర్ణ లబ్ధిదారులకు 10 కిలోల బియ్యాన్ని రాష్ట్రం ఇవ్వగా, అంత్యోదయ కార్డుదారులకు కేంద్రం 35 కిలోల బియ్యం అందజేస్తున్నాయి. కార్డుల జారీకి వార్షికాదాయాన్ని అర్హతగా తీసుకుంటున్నారు.

పాత విధివిధానాలే కొనసాగింపు : ప్రస్తుతం గ్రామీణం, అర్బన్ ప్రాంతాలకు వేర్వేరుగా ఆదాయ పరిమితులు ఉండగా కొత్తగా జారీ చేయనున్న విధివిధానాల్లోనూ అవే కొనసాగించే అవకాశాలున్నట్లు సమాచారం. కమిటీ అధ్యయనం చేసిన ఇతర రాష్ట్రాల్లో అర్బన్​ ప్రాంతాల్లో ఆదాయ పరిమితి తెలంగాణ కంటే కొంత తక్కువగా ఉంది. గుజరాత్​, తమిళనాడు, కర్ణాటకలలో గ్రామీణ, అర్బన్​ ప్రాంతాల్లో రెండు చోట్ల ఒకే రకమైన పరిమితిని అమలు చేస్తున్నారు. ఈ నెల 21న నిర్వహించే తుది సమావేశంలోపు ఆదాయ పరిమితిపై మంత్రి వర్గ ఉపసంఘం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

అక్టోబర్​లో కొత్త రేషన్‌ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ : మంత్రి ఉత్తమ్‌ - Minister Uttam on New Ration Cards

త్వరలో రేషన్​ కార్డులు జారీ - ఆగస్టు 1న కేబినెట్​ భేటీలో విధివిధానాలు : మంత్రి ఉత్తమ్​ - new ration cards in telangana

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.