ETV Bharat / technology

మెటా మరో కీలక నిర్ణయం- ఇన్‌స్టాలో బ్యూటీ ఫిల్టర్లకు గుడ్​బై! - Instagram Beauty Filters

author img

By ETV Bharat Tech Team

Published : 9 hours ago

Instagram Beauty Filter: సోషల్ మీడియా దిగ్గజం మెటా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్‌స్టాలో బ్యూటీ ఫిల్టర్లకు గుడ్‌బై చెప్పనున్నట్లు ప్రకటించింది. 2025 జనవరి నుంచి తమ యాప్స్‌లో ఈ బ్యూటీ ఫిల్టర్లు అందుబాటులో ఉండవని తెలిపింది.

Instagram Beauty Filters
Instagram Beauty Filters (face.effects Instgram)

Instagram Beauty Filters: ఇన్‌స్టాలో ఎక్కువ మంది ఇష్టపడే బ్యూటీ ఫిల్టర్ల విషయంలో మెటా కీలక నిర్ణయం తీసుకుంది. థర్డ్‌పార్టీ ఏఆర్‌ ఫిల్టర్లకు మంగళం పాడనున్నట్లు తెలిపింది. ఈ మేరకు 2025 జనవరి నుంచి తమ యాప్స్‌లో ఈ బ్యూటీ ఫిల్టర్లు అందుబాటులో ఉండవని ప్రకటించింది. దీంతో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌, వాట్సప్​లో యూజర్లు రూపొందించిన సుమారు 20 లక్షలకు పైగా ఫిల్టర్లు మాయం కానున్నాయి. ఇటీవలే ఇన్​స్టా టీన్‌ అకౌంట్స్ ప్రకటించిన మెటా తాజాగా బ్యూటీ పిల్టర్లపై మరో నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా బ్యూటీ ఫిల్టర్లకు మెటా గుడ్​బై చెప్పడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం రండి.

ఇందుకు కారణం ఇదే!:

  • ఇన్‌స్టాగ్రామ్‌ మెయిన్ ఫీచర్లలో ఈ బ్యూటీ ఫీచర్లు చాలా ప్రాచుర్యం పొందాయి.
  • వ్యక్తులు తమ రూప సౌందర్యం మెరుగుపర్చడానికి వీటిని వాడుతూ ఉంటారు.
  • మెటా స్పార్క్‌ స్టూడియో ఉపయోగించి యూజర్లు వీటిని రూపొందిస్తుంటారు.
  • అయితే ఈ బ్యూటీ ఫిల్టర్లు యువతుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందన్న నిర్ధరణకు వచ్చిన మెటా వీటికి చరమగీతం పాడాలని నిర్ణయించింది.
  • అయితే మెటా తాజా నిర్ణయంతో ఇన్‌స్టాగ్రామ్​లో ఉన్నట్లుండి ఫిల్టర్లన్నీ మాయమైపోవు.
  • మెటా అందించే ఫస్ట్‌ పార్టీ ఫిల్టర్లు యథావిధిగా కొనసాగుతాయి.
  • అయితే థర్డ్‌పార్టీ ఫిల్టర్లతో పోలిస్తే వీటి సంఖ్య చాలా తక్కువ. సుమారు 140 ఫిల్టర్లు అందుబాటులో ఉన్నాయి.
  • ఇన్‌స్టాతో పాటు ఇతర యాప్స్‌లోనూ ఈ ఫస్ట్ పార్టీ ఫిల్టర్లు కొనసాగుతాయి.
  • యూజర్లకు అవసరమైన ఉత్పత్తులపైనే దృష్టిపెట్టాలని మెటా వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
  • జనవరి వరకు యూజర్లు, క్రియేటర్లు ఈ ఫిల్టర్లను ఉపయోగించుకోవచ్చు.

Insta Teen Accounts: ఇటీవలే మెటా 18ఏళ్ల లోపు వారి కోసం కొత్తగా ఇన్​స్టా టీన్ అకౌంట్స్‌ తీసుకొచ్చింది. దీని ద్వారా ఇకపై పిల్లల ఇన్‌స్టా అకౌంట్స్ తల్లిదండ్రుల కంట్రోల్​లో ఉండనున్నాయి. పిల్లలకు కూడా ఇన్‌స్టా సురక్షిత వేదికగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెటా తెలిపింది. దీనిపై మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

స్మార్ట్​ఫోన్లపై ఫ్లిప్​కార్ట్ భారీ డిస్కౌంట్- ఏ మొబైల్​పై ఎంత ఆఫర్​ ఇస్తుందో తెలుసా? - Flipkart Offers on Mobiles

ఐఫోన్ లవర్స్​కు అమెజాన్ బంపర్ ఆఫర్- రూ.39,999లకే యాపిల్ ఐఫోన్ 13! - iPhone 13 for Rs 39999

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.