Kalki 2898AD 1000 Crores : పాన్ఇండియా రెబల్‌స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి 2898ఏడి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల జోరు కాస్త తగ్గింది. గత నెల 27న రిలీజైన ఈ చిత్రం వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే అందుకుంది. మహాభారతానికి సైన్స్ ఫిక్షన్ జోడించి దర్శకుడు నాగ్అశ్విన్ చేసిన ఈ మ్యాజిక్కు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమవుతున్న ఈచిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకుపైగా వసూళ్లను సాధించినట్లు మూవీటీమ్ అధికారికంగా ప్రకటించింది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలోను కల్కి బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాటలో పయనిస్తోంది.
రూ.1000 కోట్ల క్లబ్‌లోకి ప్రభాస్ 'కల్కి'
Published : Jul 13, 2024, 3:08 PM IST
kalki 1000 crores (Source ETV Bharat)
కాగా, గతంలో ప్రపంచవ్యాప్తంగా లాంగ్రన్ టైమ్‌లో వెయ్యి కోట్లు కలెక్షన్లు అందుకున్న 6 చిత్రాల సరసన నిలిచింది కల్కి. దంగల్ రూ.2024 కోట్లు, బాహుబలి 2 రూ.1810 కోట్లు, JRRR రూ.1387 కోట్లు, కేజీయఫ్ 2 రూ.1250 కోట్లు, పఠాన్ రూ.1050కోట్లు, జవాన్ రూ.1148 కోట్ల కలెక్షన్లు సాధించాయి.