ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్రలో ఎమ్మెల్యే దానం డ్యాన్స్ - వీడియో వైరల్ - Danam Dance at Khairatabad Ganesh - DANAM DANCE AT KHAIRATABAD GANESH
🎬 Watch Now: Feature Video
Published : Sep 17, 2024, 5:33 PM IST
MLA Danam Dance at Khairatabad Ganesh Shobha Yatra : తొమ్మిది రోజులు పూజలందుకున్న ఖైరతాబాద్ గణనాథుడు మంగళవారం గంగమ్మ ఒడికి చేరుకున్నారు. ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహా శక్తి గణపతిగా భక్తులకు కన్నులపండువగా దర్శనమిచ్చిన స్వామి శోభాయాత్ర ఘనంగా జరిగింది. భాగ్యనగరంలో ఇవాళ జరిగిన గణేశ్ నిమజ్జనంలో భాగంగా చిన్నారులు, యువతి, యువకులతో పాటు ప్రజా ప్రతినిధులు నృత్యాలతో హోరెత్తించారు.
గణేశ్ శోభాయాత్రలో ఎమ్మెల్యే దానం డ్యాన్స్ : ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన శోభాయాత్రలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉత్సవ సమితి ప్రతినిధులతో కలిసి డ్యాన్స్ చేశారు. యువత సైతం ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో డ్యాన్స్ చేస్తూ 'జై గణేశ్ మహారాజ్ కీ జై' అంటూ నినాదాలు చేశారు. ఈ దృశ్యాన్ని ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.