వారెవ్వా అనిపిస్తున్న ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర డ్రోన్ విజువల్స్ - Khairatabad Ganesh Drone Visuals - KHAIRATABAD GANESH DRONE VISUALS
🎬 Watch Now: Feature Video
Published : Sep 17, 2024, 4:28 PM IST
Khairatabad Ganesh Drone Visuals : నవరాత్రులు పూజలందుకున్న ఖైరతాబాద్ గణనాథుడిని గంగమ్మ ఒడిలోకి చేర్చారు. బొజ్జ గణపయ్యను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్‌కు బారులు తీరారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర ఘనంగా జరిగింది. వినాయక గణేశ్ నిమజ్జనంలో భాగంగా చిన్నారులు, యువతి, యువకులతో పాటు ప్రజా ప్రతినిధులు నృత్యాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో 'జై గణేశ్ మహారాజ్ కీ జై' అంటూ భాగ్యనగరం మొత్తం నామస్మరణంతో మార్మోగిపోయింది.
ఆకట్టుకుంటున్న ఖైరతాబాద్ గణేశ్ డ్రోన్ విజువల్స్ : ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతం గణేశుడి నిమజ్జనానికి విచ్చేసిన భక్తులతో కిక్కిరిసిపోయి సందడిగా మారాయి. ఖైరతాబాద్ గణేశ్ గంగమ్మ చెంతకు వెళ్లినప్పుడు భక్తులు తమ సెల్ఫోన్లలో ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జన దృశ్యాలను వీడియో, సెల్ఫీల రూపంలో భద్రపరచుకున్నారు. ఖైరతాబాద్ గణేశ్ గంగమ్మ ఒడి చేరే వరకు జరిగిన శోభాయాత్ర డ్రోన్ విజువల్స్ చూపరులను ఎంతో ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.