తెలంగాణ

telangana

ఆ దర్శకుడితో మెగా 157 - వర్కౌట్​ అయ్యే ఛాన్స్​ కష్టమే!

By ETV Bharat Telugu Team

Published : Jul 22, 2024, 8:08 AM IST

source ETV Bharat
Chiranjeevi (source ETV Bharat)

Chiranjeevi SandeepReddy Vanga Movie :మెగాస్టార్ చిరంజీవి-దర్శకుడు వశిష్ట కాంబో భారీ విజువల్ ట్రీట్ చిత్రం విశ్వంభర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిరు కెరీర్​లో మెగా156గా తెరకెక్కుతున్న ఈ సినిమా తర్వాత చిరు157 ఎవరితో ఉంటుందా అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం విశ్వంభర పనులు చివరి దశకు చేరుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో చిరు157పై అందరి దృష్టి పడింది. అయితే ఈ చిత్రాన్ని మెగాస్టార్ వీరాభిమాని సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్​ చేస్తారని ఓ రూమర్ షికారు చేస్తోంది.

మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది పక్కన పెడితే ప్రస్తుతానికి ఇది సాధ్యపడే కాంబో కాదనే అర్థమవుతోంది. ఎందుకంటే ప్రస్తుతం సందీప్ ప్రభాస్ స్పిరిట్​తో బిజీగా ఉన్నారు. అనంతరం అల్లుఅర్జున్​తోనూ ఓ మూవీ చేయాలి! కాబట్టి ఇవి పూర్తయ్యేసరికి చాలా సమయమే పడుతుంది. ఏదైనా అనూహ్యంగా జరిగితే తప్ప ఇప్పట్లో అయితే చిరు-వంగా కాంబో వర్కౌట్ అవ్వకపోవచ్చు.

ABOUT THE AUTHOR

...view details