Rohit Bal Passes Away : ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ కన్నుమూశారు. గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో అటు ఫ్యాషన్‌తో పాటు ఇటు సినీ ఇండస్ట్రీ షాక్‌కు గురైంది. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా బాల్‌కు సంతాపం తెలుపుతున్నారు.
గతేడాది నవంబర్‌లో గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఐసీయూలో చేరి చికిత్సపొందిన బాల్, రెండు వారాల క్రితం ముంబయిలో జరిగిన ప్రముఖ కాస్మటిక్స్ సంస్థ నిర్వహించిన ఫ్యాషన్ వీక్‌లో తన చివరి ప్రదర్శన ఇచ్చారు.
1986లో తన సోదరుడు రాజీవ్ బల్‌తో కలిసి తన కెరీర్‌ను ప్రారంభించి దేశంలోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్‌గా గుర్తింపు పొందారు. ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న ఆయన, ఆ రంగానికి ఎన్నో విశిష్ట సేవలను అందించారు. అనేక అవార్డులను సొంతం చేసుకున్నారు.