Kichcha Sudeep Mother Passed Away : శాండల్‌వుడ్ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి సరోజా సంజీవ్ (86) ఆదివారం కన్నుమూశారు. అనారోగ్య సమస్యల వల్ల కొన్ని రోజులుగా బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె నేడు (అక్టోబర్ 20) ఉదయం తుదిశ్వాస విడిచారు.
ఈ విషయం తెలుసుకున్న పలువురు సెలబ్రిటీలు సుదీప్‌ను పరామర్శించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు. ఇక అభిమానులు కూడా సుదీప్ మాతృమూర్తికి సంతాపం తెలియజేస్తున్నారు.