Toyota Rumion Festive Edition: ఈ పండగకు కొత్త కారు కొనాలనుకుంటున్నారా? లేకుంటే పాత కారు స్థానంలో మరొకటి తీసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ స్టోరీ. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టొయోటా కిర్లోస్కర్ మోటార్ తన ప్రసిద్ధ రూమియన్ ఫెస్టివ్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఈ పండగ సీజన్లో తన సేల్స్ పెంచుకునేందుకు కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్‌ను లిమిటెడ్‌గా తీసుకొచ్చింది. 7-సీటర్‌తో తీసుకొచ్చిన ఈ ఫ్యామిలీ కారు బుకింగ్స్ మార్కెట్లో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరెందుకు ఆలస్యం వెంటనే ఆర్డర్ చేసుకుని కొత్త కారుతో కుటుంబంతో కలిసి అసలైన పండగ సెలబ్రేట్ చేసుకోండి!
ఈ కారు స్పెషాలిటీ ఏంటో తెలుసా?: టయోటా రూమియన్ ఫెస్టివ్ ఎడిషన్‌ను TGA ప్యాకేజీతో కొంగొత్త మెరుగులు దిద్దారు. దీనికి స్టైలిష్ అప్‌గ్రేడ్స్‌తో ఆకర్షణీయమైన లుక్‌లో దీన్ని డిజైన్ చేశారు. ఇందులో బ్యాక్ డోర్ గార్నిష్, మడ్ ఫ్లాప్స్, రియర్ బంపర్ గార్నిష్, డీలక్స్ కార్పెట్ మ్యాట్‌లు ప్రత్యేకంగా రైట్-హ్యాండ్ డ్రైవ్ మోడల్‌కు ఉన్నాయి. వీటితో పాటు హెడ్‌ల్యాంప్ గార్నిష్, నంబర్ ప్లేట్ గార్నిష్, క్రోమ్ డోర్ వైజర్, రూఫ్ ఎడ్జ్ స్పాయిలర్, గార్నిష్‌తో కూడిన బాడీ సైడ్ మోల్డింగ్ వంటి ఇతర ఫీచర్లు ఈ కారుకు స్పెషల్ లుక్‌ను అందిస్తాయి.
వేరియంట్స్: ఈ కారు నాలుగు వేరియంట్స్‌లో లభిస్తుంది.
- S
- G
- V
- S CNG
పవర్‌ట్రెయిన్: ఈ స్పెషల్ ఫెస్టివ్ సీజన్ ఎడిషన్ ఇంజిన్‌లో కంపెనీ ఎలాంటి మార్పులూ చేయలేదు. ఇది ఇప్పటికే ఉన్న దాని పాత వెర్షన్లో ఉన్నట్లుగానే 1.5-లీటర్ K సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉన్నాయి. ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ ఆప్షన్స్ కోసం చూస్తున్న వినియోగదారుల కోసం ఈ 7-సీటర్ కారు పెట్రోల్, CNG పవర్‌ట్రెయిన్‌లతో అందుబాటులో ఉంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే వస్తుంది.
దీని ఏకైక పెట్రోల్ వెర్షన్ 6,000 rpm వద్ద 101 bhp పవర్‌ని, 4,400 rpm వద్ద గరిష్టంగా 136.8 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీని CNG ఫ్యూయల్ అదే ఇంజిన్ 5,500 rpm వద్ద 86.63 bhp శక్తిని, 4,200 rpm వద్ద గరిష్టంగా 121.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని పెట్రోల్ వెర్షన్ లీటరుకు 20.51 కిమీ మైలేజీని ఇస్తుంది. సిఎన్‌జి వెర్షన్ కిలోకి 26.11 కిమీ మైలేజీని ఇస్తుంది.
ధర: మార్కెట్లో దీని ధర రూ. 10.44 లక్షల నుంచి రూ. 13.73 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
లిమిటెడ్ యాడ్స్‌తో యూట్యూబ్ ప్రీమియం లైట్- ఇకపై యూజర్స్‌కు పండగే..!
దీపావళి వేళ మార్కెట్లోకి కొత్త కారు- ఫీచర్లు, డిజైన్ చూస్తే మతిపోతోందిగా..!