ETV Bharat / state

మీ వాట్సప్​కు వచ్చే ఏపీకే ఫైల్​ లింక్​ క్లిక్​ చేస్తున్నారా ? - అయితే మీ బ్యాంకు ఖాతా ఖాళీ అయినట్లే

మీ ఇల్లు మూసీ రివర్ బెడ్​లో ఉందా లేదా అని తెలుసుకోండి అంటూ వాట్సప్​కు ఏపీకే ఫైల్​ - క్లిక్​ చేస్తే బ్యాంక్​ ఖాతాలోని నగదు ఖాళీ- ఏపీకే ఫైల్స్​తో సైబర్​ నేరగాళ్ల బురిడీ

APK FILE FRAUD IN HYDERABAD
Cyber Fraud by APK File in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 1 hours ago

Cyber Fraud by APK File in Hyderabad : మీ ఇల్లు మూసీ రివర్ బెడ్​లో ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఈ ఏపీకే ఫైల్​ను క్లిక్ చేయండి. మీకు రుణమాఫీ ఆయిందో లేదో తెలుసుకోవాలంటే ఈ యాప్​ను ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇలా మీకు వాట్సాప్ లో వచ్చిన సందేశాల ద్వారా ఏపీకే ఫైల్ డౌన్​లోడ్​ చేశారా ? అయితే మీ మొబైల్​ ఫోన్​ సైబర్​ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లిపోయినట్లే. ఫోన్​లో ఇన్​స్టాల్​ అయిన మాల్వేర్​ ద్వారా సైబర్​ నేరగాళ్లు మీకు తెలియకుండానే మీ ఖాతాలో నగదును కాజేస్తారు. ఇటీవల నగరానికి చెందిన ఓ బాధితుడికి ఈ విధంగా సందేశం వచ్చింది.

'మీ బ్యాంక్​ ఖాతా ఈరోజు తొమ్మిదిన్నర గంటలకు బ్లాక్​ అవుతుంది. దయచేసి మీ పాన్​కార్డును అప్​డేట్​ చేసుకోండి. దీని కోసం మీకు వచ్చిన మెసేజ్​లోని బ్యాంకు ఏపీకే అప్లికేషన్​కు క్లిక్​ చేయండి' అని వాట్సప్​కు ఓ బ్యాంకు లోగో డీపీగా ఉన్న నంబర్​ నుంచి మెసేజ్​ వచ్చింది. బాధితుడి వెంటనే లింక్​ను క్లిక్​ చేయగానే ఫోన్ సాఫ్ట్​వేర్​ అలర్ట్​ వచ్చింది. దీంతో వెంటనే యాప్​ను అన్​ఇన్‌స్టాల్ చేశాడు. జరిగిందంతా తన స్నేహితులతో చెప్పి ఫోన్​ను ఫార్మాట్​ చేశాడు. నగరానికి చెందిన మరో ప్రైవేట్​ ఉద్యోగికి సైతం కస్టమర్ సపోర్ట్ పేరుతో ఏపీకే ఫైల్​ డౌన్​లోడ్​ చేసుకోవాలంటూ వాట్సప్​కు మెసేజ్​ వచ్చింది. దీంతో యాప్ ఇన్‌స్టాల్ చేయగానే అతని పేరుపై ఈసిమ్‌ యాక్టివేట్ అయిందని సందేశం వచ్చింది.

లింకులు క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతా ఖాళీ : వెంటనే అతని బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 1.06 లక్షలు మాయం అయ్యాయి. డెబిట్ అయిన సందేశం కూడా ఫోన్​కు రాకపోవడంతో ఖంగుతిన్నాడు. దీంతో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా ఏపీకే ఫైల్స్​లను పంపి డబ్బులు కాజేశారని సుమారు 15 మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవే కాదు ఇటీవల రుణమాఫీ సమయంలో ప్రభుత్వ బ్యాంకుల లోగోలతో ఏపీకే ఫైల్స్ సైబర్ నేరగాళ్లు రైతుల ఫోన్ నంబర్లకు పంపారు. తాజాగా మూసీ రివర్ బెడ్​లో ఇళ్లు ఉన్నాయా లేదా తెలుసుకునేందుకు కూడా ఏపీకే ఫైల్స్ పంపుతున్నారని పోలీసులు చెబుతున్నారు. ఇటువంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు. ఎలాంటి సంబంధం లేకున్నా వచ్చే సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

ఆ మాయమాటలు నమ్మారో - మీ బ్యాంక్​ ఖాతా ఖాళీ కావడం గ్యారెంటీ! - How To Protect From Bank Fraud

సైబర్​ నేరాలపై స్వీయ అప్రమత్తతే శ్రీరామరక్ష - వాటికి చిక్కుకోకుండా ఉండాలంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.