ETV Bharat / state

కుక్కను కొట్టబోయి తప్పిన బ్యాలెన్స్ - మూడో అంతస్తు నుంచి పడి యువకుడి మృతి - వీడియో వైరల్ - YOUNG MAN DIED AFTER CHASED BY DOG

చందానగర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విషాదం - హోటల్​లో కుక్కను తరుముతూ అదుపుతప్పి మూడో అంతస్తుపై నుంచి పడి యువకుడు మృతి - సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు

Young Man Died After Chased By A Dog
Young Man Died After Chased By A Dog (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 22, 2024, 9:37 AM IST

Updated : Oct 22, 2024, 3:16 PM IST

Young Man Died while Playing with a Dog : వీకెండ్​ను సరదాగా ఎంజాయ్ చేసేందుకు కొంతమంది యువకులు ఓ హోటల్​కు వెళ్లారు. హోటల్​లో చెక్ ఇన్ అయ్యి తమకు కేటాయించినా గదులకు వెళ్లేందుకు మూడో అంతస్తుకు వెళ్లారు. అంతలోనే ఓ కుక్క బాల్కనీ వద్ద ప్రత్యక్షమైంది. దాన్ని చూసి ఓ యువకుడు సరదాగా దాన్ని ఆట పట్టిద్దామనుకున్నాడు. దాన్ని తరుముతూ వెంటపడ్డాడు. ఆ క్రమంలో పరిగెత్తుకుంటూ వెళ్లి అదుపుతప్పి మూడో అంతస్తులోని కిటికీ నుంచి కిందపడి మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్​లో జరిగింది.

స్నేహితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్​ రామచంద్రాపురంలోని అశోక్‌నగర్‌లో తెనాలి యువకుడు ఉదయ్‌ (23) నివాసం ఉంటున్నాడు. ఆదివారం రోజున తన స్నేహితులతో కలిసి అతడు చందానగర్‌లోని వీవీప్రైడ్‌ హోటల్‌కు వెళ్లాడు. హోటల్​ మూడో అంతస్తు బాల్కనీలోకి వచ్చాడు. అక్కడే ఉదయ్​ ఓ కుక్కను చూశాడు. మొదట సరదాగా దాంతో ఆడుకోవాలనుకున్నాడు. ఆ తర్వాత దాన్ని కొట్టబోతూ, తరుముతూ ఆటపట్టించాడు. కానీ ఉదయ్ చేష్టలకు భయపడ్డ ఆ శునకం అక్కడి నుంచి పరిగెత్తింది.

దాని వెంటే ఉదయ్ కూడా పరిగెత్తాడు. అయితే ఆ బాల్కనీలో మలుపు వద్ద కుక్క యూటర్న్ తీసుకోగా, ఫాస్ట్​గా పరిగెత్తిన ఉదయ్ ఎదురుగా ఉన్న కిటికీని పట్టుకోబోయాడు. సరదాగా బెదిరించాలని చూసి దాని వెనక పరిగెత్తాడు. మళ్లీ వెనక్కి తిరిగి దాని వెంట పరిగెత్తుకుంటూ వస్తూ ఎదురుగా ఉన్న కిటికీని పట్టుకోబోయాడు. కానీ అదుపుతప్పి కిటికీలో నుంచి కిందపడ్డాడు. మూడో అంతస్తులో ఉన్న ఆ కిటికీకి అద్దం లేకపోవడంతో ఉదయ్ కింద పడిపోయాడు.

Young Man Dies By Jumping Out OF Window : వెంటనే స్పందించిన తోటి స్నేహితులు కేకలు వేస్తూ పరుగెత్తుతూ మూడో అంతస్తు నుంచి కిందకు వెళ్లారు. పూర్తిగా రక్తంతో తడిసిపోయి ఉన్న ఉదయ్​ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయ్ మరణించాడు. ఆ విషయాలు అన్నీ హోటల్​ గదిలోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అయితే కుక్కతో ఆడుకున్న ఉదయ్​ ఇలా అనుకోకుండా ప్రమాదవశాత్తు మూడో అంతస్తు నుంచి పడి చనిపోయాడు.

అతను కుక్కతో ఆడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో కనిపించాయి. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన బయటకు రాకుండా హోటల్ యాజమాన్యం జాగ్రత్తపడ్డారు. ఎట్టకేలకు ఈ విషయం బయటకు తెలియడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. హోటల్‌ మూడో అంతస్తులోకి కుక్క ఎలా వెళ్లిందనే విషయంపై వీవీ ప్రైడ్‌ హోటల్ యాజమాన్యం, సిబ్బందిని ఆరా తీశారు.

'టపాసులంటే భయం- తుపాకీ ఎలా కాల్చాడు?'- 'బద్లాపుర్' హత్యాచారం నిందితుడి మృతిపై CID విచారణ - Badlapur case CID Investigation

How to Face Fear of Failure in Life : భయం వెంటాడుతోందా..?

Last Updated : Oct 22, 2024, 3:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.