వారికి మంచు విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్ - రెండు రోజులే టైమ్ ఇస్తున్నానంటూ!
Published : Jul 10, 2024, 9:18 PM IST
Vishnu Manchu Strong Warning to the Youtubers : నటీనటులపై అసభ్యకర, అశ్లీల వీడియోలు చేస్తున్న యూట్యూబర్లను మా అధ్యక్షుడు మంచువిష్ణు హెచ్చరించారు. నటీనటులు, వారి కుటుంబసభ్యులపై అశ్లీలంగా పెట్టిన వీడియోలు, పోస్టులను 48 గంటల్లో తొలగించాలని సూచించారు. లేదంటే ఆ యూట్యూబర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఛానల్స్‌ను మూసివేయించనున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల ఓ చిన్నారిపై అసభ్యకరంగా మాట్లాడిన యూట్యూబర్ ఉదంతంపై స్పందించారు మంచు విష్ణు. ఆ వీడియోలోనే మహిళలను కించపరిచేలా వ్యవహారించిన ఆ యూట్యూబర్‌పై చర్యలు తీసుకున్న ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటనతో మా అసోసియేషన్‌కు చాలా మంది నటీనటులు లేఖలు, మెయిల్స్ రాస్తున్నారని, తమ వీడియోలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు విష్ణు పేర్కొన్నారు. వారి అభ్యర్థనపై స్పందించిన విష్ణు సామాజిక మాద్యమాల ద్వారా నటీనటుల వ్యక్తిత్వాన్ని కించపరిస్తూ వీడియోలు చేస్తున్న యూట్యూబర్లకు హెచ్చరించారు.