ETV Bharat / technology

సుజుకి మోటార్ కార్పొరేషన్ మొట్టమొదటి ఈవీ- ఫస్ట్ లుక్​ మామూలుగా లేదుగా..!

సుజుకి ఇ విటారా ఫస్ట్ లుక్​ రివీల్- రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Suzuki e Vitara
Suzuki e Vitara (Globalsuzuki)
author img

By ETV Bharat Tech Team

Published : 3 hours ago

Updated : 2 hours ago

Suzuki e Vitara: ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. పర్యావరణానికి అనుకూలంగా ఉండటంతో వీటిని వాడేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మార్కెట్లో వీటి సేల్స్ మంచి జోరందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ వాహన తయారీ సంస్థలు అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలపై ఫోకస్ చేస్తున్నాయి. కస్టమర్ల అభిరుచి, ఆసక్తికి అనుగుణంగా కొంగొత్త వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL) మాతృ సంస్థ అయిన జపాన్‌కు చెందిన సుజుకి మోటార్ కార్పొరేషన్ కూడా తన ఫస్ట్ బ్యాటరీ విద్యుత్ వాహనాన్ని ఆవిష్కరించింది.

Suzuki e Vitara
Suzuki e Vitara (Globalsuzuki)

ఇటలీలోని మిలన్‌లో సోమవారం 'ఇ విటారా' పేరుతో ఈ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ (BEV) మోడల్‌ను పరిచయం చేసింది. మన దేశంలోని సుజుకీ మోటార్‌ 2025 వసంత కాలంలో గుజరాత్‌లో ఈ మోడల్‌ ఉత్పత్తి ప్రారంభించబోతున్నట్లు తెలిపింది. కొత్త 'ఇ విటారా' సేల్స్​ను.. ఐరోపా, భారత్, జపాన్‌ తదితర దేశాల్లో 2025 వేసవి నుంచి ప్రారంభించనున్నట్లు కంపెనీ పేర్కొంది.

Suzuki e Vitara
Suzuki e Vitara (Globalsuzuki)

వచ్చే ఏడాది ఈ మోడల్‌ను రిలీజ్ చేసేందుకు మారుతీ సుజుకీ ఇండియా ప్లాన్​ చేస్తోంది. మారుతీ సుజుకీ ఇండియాలో సుమారు 58% వాటా సుజుకీదే. ఈ 'ఇ విటారా' బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ కాన్సెప్ట్‌ మోడల్‌ 'ఈవీఎక్స్‌' ఆధారంగా తీసుకొస్తున్నారు. ఈ కాన్సెప్ట్‌ను 2023 జనవరిలో మన దేశంలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో, అదే ఏడాది అక్టోబరులో జపాన్‌లో జరిగిన మొబిలిటీ షోలో ప్రదర్శించారు.

Suzuki e Vitara
Suzuki e Vitara (Globalsuzuki)

"ఇ విటారా మా మొదటి బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్. దీన్ని మా ఖాతాదార్లు సులభంగా వాడుకునేలా రూపొందించాం. కార్బన్ న్యూట్రల్ సొసైటీ కోసం బీఈవీలతో పాటు హైబ్రిడ్‌ వాహనాలు, సీఎన్‌జీ వెహికల్స్​ను వివిధ ప్రాంతాల్లో విడుదల చేస్తాం. కర్బన తటస్థాన్ని సాధించేందుకు ఈ ఇ విటారా బ్యాటరీ విద్యుత్ వాహనంతో అడుగులు వేశాం." - తొషిహిరో సుజుకీ, సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ ప్రెసిడెంట్, రెప్రజెంటేటివ్‌ డైరెక్టర్‌

బైక్ లవర్స్​కు గుడ్​న్యూస్- హీరో మోటోకార్ప్​ నుంచి నాలుగు కొత్త టూ-వీలర్స్

జియో, ఎయిర్‌టెల్‌ సంస్థలకు షాక్- దేశంలో BSNL 5G సేవలు షురూ!

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.