ETV Bharat / state

భద్రతా సిబ్బందిని గణనీయంగా తగ్గించుకున్న సీఎం - ఇకపై అటానమస్ డ్రోన్లతో పర్యవేక్షణ - AP CM CHANDRABABU SECURITY

సాంకేతిక సాయాన్ని వినియోగించుకుంటూ తనకున్న భద్రతను గణనీయంగా తగ్గించుకున్న ఏపీ సీఎం చంద్రబాబు

Autonomous Drones  For AP CM Chandrababu Security  Monitor
Autonomous Drones For AP CM Chandrababu Security Monitor (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 22, 2024, 7:57 PM IST

Updated : Dec 22, 2024, 8:04 PM IST

Autonomous Drones For AP CM Chandrababu Security Monitor : ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సాంకేతిక సాయాన్ని వినియోగించుకుంటూ తనకున్న భద్రతను గణనీయంగా తగ్గించుకున్నారు. భారీ భద్రత, బందోబస్తుకు ఆయన దూరంగా ఉంటున్నారు. ముఖ్యమంత్రి నివాసంలో అటానమస్ డ్రోన్ల సాయంతో పరిసర ప్రాంతాల భద్రత పర్యవేక్షణను పోలీసులు చేపట్టారు.

తక్కువ మంది సిబ్బంది, టెక్నాలజీ సాయంతో ప్రణాళికతో వ్యవహరించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఉండవల్లిలోని సీఎం నివాసంలో అత్యాధునిక డ్రోన్‌ పరికరాన్ని ఏర్పాటు చేశారు. ఆ డ్రోన్ తనకు ప్రోగ్రాం ఇచ్చిన విధంగా ప్రతి 2 గంటలకు ఒకసారి పరిసర ప్రాంతాల్లో ఎగిరి వీడియోను షూట్ చేస్తుంది. సాధారణ పరిస్థితుల కంటే భిన్నంగా ఏవిధమైన మూమెంట్(కదలికలు) కనిపించినా కొత్త, అనుమానాస్పద వస్తువులు కనిపించినట్లయితే మానిటరింగ్ టీమ్‌కు సందేశం పంపుతుంది. చంద్రబాబు నివాసంలో పెట్టినటువంటి ఈ డ్రోన్ అటానమస్ విధానంలో ఆటోపైలట్‌గా ఆయా ప్రాంతాల్లో ఎగురుతూ పర్యవేక్షిస్తుంది. మళ్లీ వచ్చి నిర్దేశిత డక్‌పై ల్యాండ్ అయి తానే ఛార్జింగ్ కూడా పెట్టుకుంటుంది. ఈ డ్రోన్ పంపేటువంటి డేటాను విశ్లేషించడం ద్వారా ఇంటి పరిసర ప్రాంతాల్లో భద్రతను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

ప్రజలు, పార్టీ కార్యకర్తలను తనకు దూరం చేసేలా బందోబస్తు ఉండరాదని ఏపీ సీఎం చంద్రబాబు ఎన్ని సార్లు ఆదేశించినప్పటికీ ప్రొటోకాల్ రూల్స్​ పేరుతో అధికారులకు అది కష్టతరంగా మారింది. సమస్యను అధిగమించేందుకు డ్రోన్ సాంకేతికత ద్వారా తనకున్నటువంటి సిబ్బందిని ముఖ్యమంత్రి చంద్రబాబు గణనీయంగా తగ్గించేశారు. అన్ని జిల్లాల అధికారులు ఈ ఆదేశాలు పాటించాలని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. చంద్రబాబు ఆదేశాలతో భద్రతలో సమూల మార్పులను చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో ముఖ్యమంత్రికి 980 మందితో భద్రతను కల్పించేవారు. ప్రస్తుతం చంద్రబాబుకు కేవలం 121 మందితో భద్రతను కల్పిస్తున్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు కాన్వాయ్‌లో 17 వాహనాలు ఉండేవి. జడ్ ప్లస్ భద్రత ఉన్న ప్రస్తుత సీఎం చంద్రబాబు వాహన శ్రేణి 11 వాహనాలకు మాత్రమే పరిమితమైంది.

ఏపీ సీఎం చంద్రబాబు వినూత్న ఆలోచన - ఔట్​ సోర్సింగ్ ఏజెన్సీకి రహదారుల నిర్వహణ

ఏపీలో విధ్వంసం పోయి, నిర్మాణం ప్రారంభం - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Last Updated : Dec 22, 2024, 8:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.