Hero MotoCorp: బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. త్వరలో మార్కెట్లోకి ప్రముఖ టూ-వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ నుంచి నాలుగు కొత్త టూ-వీలర్స్ రానున్నాయి. వీటిలో ఒక ఎలక్ట్రిక్ స్కూటీ కూడా ఉంది. ఇటలీలోని మిలాన్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మోటార్ సైకిల్, యాక్సెసరీజ్ ఎగ్జిబిషన్లో కంపెనీ వీటిని ఆవిష్కరించింది.
మోటోకార్ప్ కొత్త టూ-వీలర్స్ ఇవే:
- ఎక్స్‌ట్రీమ్ 250ఆర్
- కరిజ్మా ఎక్స్‌ఎంఆర్ 250
- ఎక్స్‌పల్స్ 210
- హీరో విడా జెడ్
వీటిలో హీరో ఎక్స్‌ట్రీమ్ 250ఆర్, కరిజ్మా ఎక్స్‌ఎంఆర్ 250 రెండు బైక్‌లూ ఒకే రకమైన ఇంజిన్‌తో వస్తున్నాయి. వీటిలో 250సీసీ సింగిల్ సిలిండర్, డీఓహెచ్‌సీ, 4 వాల్యూడ్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ 30hp, 25Nm పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది 3.25 సెకన్లలో 0- 60 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకుంటుంది. కంపెనీ మరి కొన్ని నెలల్లో వీటిని మార్కెట్లోకి తీసుకురానుంది.
ఈ రెండింటిలో ఇతర ఫీచర్లు:
- క్లాస్- డీ ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు
- లాప్ టైమర్
- డ్రాగ్ రేస్ టైమర్
- ఏబీఎస్ మోడ్స్
- మ్యూజిక్ కంట్రోల్స్
- టర్న్- బై- టర్న్ నావిగేషన్
Hero XPulse 210: ఈఐసీఎంఏ ఈవెంట్ (EICMA 2024)లో హీరో మోటోకార్ప్ ఆవిష్కరించిన మరో బైక్ హీరో ఎక్స్‌పల్స్ 210. ఇది 210సీసీ సింగిల్ సిలిండర్ కూల్డ్ ఇంజిన్‌తో రానుంది. ఇది 24.6hp, 20.7Nm పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్‌తో వస్తోంది. ఈ బైక్ డిజైన్ ఎక్స్‌పల్స్200 మాదిరిగానే ఉంటుంది.
XPulse 210లో ఇతర ఫీచర్లు:
- స్విచ్చబుల్ ఏబీఎస్
- 4.2 అంగుళాల టీఎఫ్‌టీ స్క్రీన్
- బ్లూటూత్ కనెక్టివిటీ
Hero Vida Z: హీరో మోటోకార్ప్ నుంచి ఆవిష్కరించిన వాటిలో ఒక ఎలక్ట్రిక్ స్కూటీ కూడా ఉంది. దీన్ని హీరో విడా జెడ్ పేరుతో పరిచయం చేసింది. తాజాగా దీని లుక్‌ను ఆవిష్కరించింది. ఈ స్కూటీలోని బ్యాటరీ సామర్థ్యం 2.2kWh నుంచి 4.4kWh మధ్య ఉంటుందని అంచనా. వెహికల్ హెల్త్, థెఫ్ట్ కంట్రోల్, జియోఫెన్సింగ్ వంటి ఈ ఫీచర్లతో కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటీని తీసుకురానుంది.
మెట్రో ప్రయాణికుల కోసం సరికొత్త సర్వీస్- ఇకపై మీ జర్నీ మరింత ఈజీ..!