సింగర్ సుశీలకు స్వల్ప అస్వస్థత- హాస్పిటల్లో చికిత్స
Published : Aug 17, 2024, 9:55 PM IST
P Susheela Health update:ప్రముఖ గాయని పి. సుశీల శనివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కడుపులో నొప్పితో ఆమె చైన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చేరారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందుతోంది. అయితే ఇప్పుడు సుశీల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కాగా, సుశీల 1950-1990 వరకు దక్షిణ భారతదేశంలో అత్యంత విజయవంతమైన గాయకురాలిగా ఎదిగారు. భారతీయ సినిమా రంగలో తనదైన ముద్ర వేశారు. ఇక ఆమెను 2008లో భారత ప్రభుత్వం ప్రద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. దీంతోపాటు సుశీల కెరీర్లో ఐదు జాతీయ పురస్కారాలు అందుకున్నారు.