Prisons in India Report That TS Inmates Getting Low Daily Wage : ఖైదీలకు రోజువారి కూలీ చెల్లింపులో తెలంగాణ జైళ్ల శాఖ పిసినారితనం ప్రదర్శిస్తోంది. తక్కువ వేతనం ఇస్తూ ఖైదీలతో వెట్టిచాకిరీ చేయిస్తోంది. నైపుణ్యం లేని ఖైదీలకు రోజుకు మరీ రూ.30 మాత్రమే చెల్లించడమే దీనికి నిదర్శనం. మిజోరాంలోని జైళ్లలో మరీ తక్కువగా రూ.20 చొప్పున ఇస్తున్నారు. కర్ణాటకలో ఏకంగా రూ.524 చొప్పున చెల్లిస్తున్నారు. తెలంగాణలోని ఖైదీలకు అందే కూలీతో పోలిస్తే బయట దక్కే కూలీ దాదాపు 10 రెట్లు ఎక్కువ. సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ప్లానింగ్ తాజాగా విడుదల చేసిన ప్రిజన్స్ ఇన్ ఇండియా నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అందులో ఉన్న మరికొన్ని వివరాలు.
భార్యపై అనుమానంతో హత్య - ఆపై అగ్నిప్రమాదంగా చిత్రీకరించిన భర్త
- తెలంగాణ జైళ్లలో ఒక్కరూ కూడా మత్తుకు బానిసైన ఖైదీలు లేరు. కాగా దేశవ్యాప్తంగా 55,502 మంది ఉన్నట్లు గుర్తించారు.
- అరెస్టయి ఏడాదికి పైగా జైళ్లలోనే ఉంటున్న ఖైదీల సరళిని పరిశీలిస్తే, కోర్టుల్లో సాక్ష్యాధార పరిశీలన నాటికి జైళ్లలోనే మగ్గుతున్న ఖైదీలే ఎక్కువగా ఉంటున్నారు. అన్ని న్యాయస్థానాల పరిధిలో 73,043 ఖైదీలు ఉన్నారు. తెలంగాణలో 215 మంది ఉన్నారు.
- 2023లో అన్ని హైకోర్టుల్లో డిఫాల్ట్ బెయిల్ పొందిన ఖైదీల సంఖ్య 14,785 కాగా, తెలంగాణ హైకోర్టు ద్వారా డిఫాల్ట్ బెయిల్ పొందిన వారు 629. బెయిల్ మంజూరైనా అవసరమైన పూచీకత్తు లభించకపోవడంతో జైళ్లలోనే మగ్గుతున్న ఖైదీలు దేశవ్యాప్తంగా 24,879 మంది ఉన్నట్లు తేల్చారు. అలహాబాద్ కోర్టు పరిధిలో 6,158 మంది ఖైదీలు ఉంటే, తెలంగాణలో నిల్.
- దేశవ్యాప్తంగా 1,327 జైళ్లకు గాను 1,140 ప్రిజల్ లీగల్ ఎయిడ్ క్లినిక్‌లు (పీఎల్‌ఏసీ) ఉండగా, తెలంగాణలో 38 జైళ్లలో 30 పీఎల్‌ఏసీలు ఉన్నాయి. వీటిద్వారా ఖైదీలకు అవసరమైన న్యాయ సహాయం అందుతోంది.
- అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ(యూటీఆర్‌సీ) ప్రతిపాదించినా విడుదలవుతున్న ఖైదీల సంఖ్య సగంలోపే ఉంది. దేశవ్యాప్తంగా గతేడాది యూటీఆర్‌సీ ప్రతిపాదించిన 73,635 మంది విచారణ ఖైదీల్లో 35,398 విడుదల కాగా సత్ప్రవర్తన కింద 352 మంది బయటికి వచ్చారు. ఇందులో తెలంగాణకు చెందిన వారు ఐదుగురు ఉన్నారు.
- తెలంగాణలో కుటుంబ వార్షికాదాయం రూ.30 వేలలోపు ఉన్న ఖైదీలే ఎక్కువ ఉన్నారు. వారి సంఖ్య 1,213 కాగా రూ.30 వేల నుంచి రూ.లక్షలోపు ఆదాయమున్న ఖైదీల సంఖ్య 1,147. రూ.1 లక్ష నుంచి 10 లక్షల్లోపు ఆదాయం ఉన్న ఖైదీలు 1,135 మంది. రూ.10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న ఖైదీలు 118 మంది ఉన్నారు.
'నన్నే అంత మాట అంటావా?' - అర్ధరాత్రి ఇంటికి పిలిపించుకుని మరీ హత్య
వివాహేతర సంబంధం అడ్డుపెట్టుకుని మహిళ బ్లాక్ మెయిల్ - వేధింపులు భరించలేక హత్య