Pinaka Weapon System: రక్షణరంగ ఉత్పత్తుల తయారీలో దూసుకుపోతున్న DRDO తాజాగా గైడెడ్ పినాక వెపన్ సిస్టమ్ ఫ్లైట్ టెస్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో ఇండియన్ ఆర్మీ బలం మరింత పెరగనుంది. ప్రొవిజనల్ స్టాఫ్ క్వాలిటేటివ్ రిక్వైర్‌మెంట్స్ (PSQR) వాలిడేషన్ ట్రయల్‌లో భాగంగా వివిధ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లలో ఫ్లైట్ ట్రయల్స్ నిర్వహించింది. ఈ మేరకు దీనికి సంబంధించిన సమాచారాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది.
సమాచారం ప్రకారం.. మూడు దశల్లో వివిధ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లలో ఫ్లైట్ టెస్ట్‌లు నిర్వహించారు. ఈ ట్రయల్స్ సమయంలో రాకెట్ ప్రయోగ సామర్థ్యం, ఖచ్చితత్వం, స్థిరత్వంతో పాటు ఫైరింగ్ రేట్‌ను లెక్కించారు. డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టెస్ట్ చాలా కీలకమైనది. ఈ పినాక ఆయుధ వ్యవస్థను భారత సైన్యంలోకి చేర్చడానికి ముందు పరీక్షించిన చివరి దశ ఇది.
DRDO has successfully completed the Flight Tests of Guided #Pinaka Weapon System. Various parameters such as ranging, accuracy, consistency and rate of fire for multiple target engagement in a salvo mode were assessed during the trials. The tests were conducted in three phases at… pic.twitter.com/qVtq4MqCse
— Ministry of Defence, Government of India (@SpokespersonMoD) November 14, 2024
ఈ దశలో రాకెట్ రేంజ్, ఖచ్చితత్వం, స్థిరత్వంతో పాటు మల్టిపుల్ టార్కెట్స్పై ఏకకాలంలో దాడి చేయగల సామర్థ్యాన్ని పరీక్షించారు. ఇందుకోసం రెండు పినాక లాంచర్లను ఉపయోగించారు. ఈ విజయం తర్వాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ DRDO, భారత సైన్యాన్ని అభినందించారు. గైడెడ్ పినాకా వెపన్ సిస్టమ్ సాయుధ బలగాల మందుగుండు శక్తిని మరింత పెంచుతుందని ఆయన అన్నారు.
ఈ పరీక్షలో పాల్గొన్న టీమ్స్‌ను DRDO (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్) చీఫ్ డాక్టర్ సమీర్ వి.కామత్ అభినందించారు. ఈ రాకెట్ సిస్టమ్‌ను భారత సైన్యంలోకి చేర్చడానికి ముందు అవసరమైన అన్ని ఫ్లైట్ టెస్ట్‌లను విజయవంతంగా పూర్తి చేసిందని ఆయన చెప్పారు.
Validation Trials of #GuidedPinaka Weapon System as part of PSQR has been successfully completed and parameters viz., ranging, accuracy, consistency and rate of fire for multiple target engagement in a salvo mode have been assessed by extensive testing of rockets. pic.twitter.com/Rb2Zy1PgRZ
— DRDO (@DRDO_India) November 14, 2024
ప్రెసిషన్ స్ట్రైక్ పినాకా మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్ పూర్తిగా ఇండియాలోనే రూపొందించారు. కొన్ని ఇతర సంస్థల సహకారంతో ఆర్మమెంట్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ దీన్ని అభివృద్ధి చేసింది. ఈ ఇన్స్టిట్యూషన్స్లో రీసెర్చ్ సెంటర్ బిల్డింగ్స్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాబరేటరీస్, హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబరేటరీస్ వంటివి ఉన్నాయి.
అసలేంటీ పినాక వెపన్ సిస్టమ్?: సాధారణంగా శివుడి విల్లును పినాకం అని పిలుస్తారు. ఆ పేరుతోనే ఈ రాకెట్ సిస్టమ్‌ను డెవలప్ చేశారు. చాలా శక్తివంతమైన ఈ పినాక ఆయుధ వ్యవస్థ శత్రువులకు ప్రాణాంతకం అవుతుంది. ఈ రాకెట్ సిస్టమ్ ఇప్పుడు 25 మీటర్ల నుంచి 75 కి.మీ దూరం వరకు టార్గెట్‌ను గురిపెట్టగలదు. దీని వేగం సెకనుకు 1000-1200 మీటర్లు. అంటే ఒక్క సెకనులో ఇది ఒక కిలోమీటరు దాటుతుంది. దీన్ని ఒకసారి ప్రయోగించాక ఆపడం అసాధ్యం. గతంలో 38 కిలోమీటర్ల మేర ఉన్న పినాక పరిధి ఇప్పుడు 75 కిలోమీటర్లకు పెరగనుంది. దీని యాక్యురసీ కూడా మునుపటి కంటే చాలా రెట్లు మెరుగ్గా ఉంది.
BMW కొత్త కారు భలే ఉందిగా.. ప్రీమియం ఫీచర్లు, అదిరిపోయే డిజైన్, మైలేజీలోనూ సూపరంతే..!
భూమికి గుడ్‌బై చెప్పనున్న రెండో మూన్- ఆకాశంలో రెండు చందమామలు ఉన్నాయని మీకు తెలుసా?