ETV Bharat / offbeat

పిండిలో ఇదొక్కటి కలిపి "చపాతీలు" ప్రిపేర్ చేసుకోండి - సూపర్ సాఫ్ట్​గా, దూదిలా మెత్తగా వస్తాయి! - HOW TO MAKE SOFT CHAPATI

చపాతీలు మెత్తగా రావాలంటే - పిండి కలిపేటప్పుడు ఈ సీక్రెట్ టిప్స్ ఫాలో అవ్వండి!

HOW TO MAKE SOFT CHAPATi
Soft Chapati Making Tips (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 15, 2024, 3:37 PM IST

Soft Chapati Making Tips : నేటి రోజుల్లో చాలా మంది రోజువారీ ఆహారంలో చపాతీ తప్పనిసరిగా మారింది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు రాత్రిపూట అన్నానికి బదులుగా చపాతీని బెస్ట్ ఆప్షన్​గా ఎంచుకుంటుంటారు. అయితే, కొంతమంది చపాతీలు చేసుకునేటప్పుడు ఎన్ని చిట్కాలు ట్రై చేసినా మెత్తగా, సాఫ్ట్​గా రావడం లేదని ఫీలవుతుంటారు. అలాంటి వారు ఓసారి పిండి తడిపేటప్పుడు ఇదొక్కటి వేసి కలుపుకొని చపాతీలను ప్రిపేర్ చేసుకోండి. అప్పుడు చపాతీలు పొరపొరలుగా ఆల్ట్రా సాఫ్ట్​గా వస్తాయి. ఇంతకీ, పిండిని ఎలా కలుపుకొని చపాతీలను తయారుచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • మాగిన అరటిపండు - 1
  • గోధుమపిండి - 2 కప్పులు
  • ఉప్పు - కొద్దిగా
  • నూనె - తగినంత
  • వాటర్ - సరిపడా

తయారీ విధానం :

  • ముందుగా ఒక బౌల్​లో మాగిన అరటిపండు, ఉప్పు వేసుకొని మెత్తగా మాష్ చేసుకోవాలి. ఆపై అందులో గోధుమపిండి, నూనె వేసి చేతులతో నెమ్మదిగా నిమురుతుంటే బ్రెడ్ పొడిలా తయారవుతుంది.
  • అనంతరం ఆ మిశ్రమంలో ముప్పావు కప్పు వరకు వాటర్​ని కొద్దికొద్ది పోసుకుంటూ పిండిని తడుపుకోవాలి. అప్పుడే పిండి లోపలిదాకా మెత్తగా తడుస్తుందని గుర్తుంచుకోవాలి. అయితే, చపాతీలు సాఫ్ట్​గా రావడం అనేది మీరు పిండిని తడిపే, వత్తుకునే తీరు మీదే ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.
  • పిండిని తడిపి పెట్టుకున్నాక ఒకవేళ పిండి ముద్ద ఇంకా కాస్త గట్టిగా, పగుళ్లతో ఉంటే అప్పుడు మరో నాలుగు టేబుల్ స్పూన్ల వాటర్ చల్లుకొని మణికట్టుతో పిండి ముద్దను బాగా సాగదీస్తూ వెనక్కి లాగుకుంటూ సాఫ్ట్​గా మారేంత వరకు వత్తుకోవాలి. ఇందుకోసం కనీసం 12 నిమిషాల వరకు సమయం పట్టొచ్చు.
  • ఆఖరుగా మీరు సాఫ్ట్​గా కలిపి పెట్టుకున్న పిండి ముద్దపై మరో టేబుల్ స్పూన్ నీళ్లు చల్లుకొని మరోసారి పిండిని మెత్తగా వత్తుకోవాలి.
  • అయితే, పిండి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో మెత్తగా అయిందని ఎలా తెలుస్తుందంటే.. పిండిని పట్టుకుంటే వేళ్లు లోపలికి సులువుగా దిగిపోవాలి. పిండి లోనుంచి వేలు తీస్తే చేయి క్లీన్​గా రావాలి. అంటే.. పట్టుకుంటే పిండి చేతులకు అంటుకోకూడదన్నమాట. అలా వచ్చిందనుకో మీరు తడిపి పెట్టుకున్న పిండి సరైన కన్సిస్టెన్సీలో మెత్తగా వచ్చిందని అర్థం చేసుకోవాలి.
  • ఆవిధంగా పిండిని రెడీ చేసుకున్నాక దానిపై ఓ తడి క్లాత్​ను కప్పి పావుగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత పిండిని మరోసారి కలుపుకొని ఆపై కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్లీ బాగా వత్తుకుంటే పిండి మరింత మెత్తగా అవుతుంది. అనంతరం ఆ పిండి ముద్దను చిన్న చిన్న సమాన ఉండలుగా చేసుకోవాలి.

ఫ్రిడ్జ్​లో పెట్టినా "చపాతీ పిండి" త్వరగా పాడవుతోందా? - ఈ టిప్స్​తో చాలా ఫ్రెష్​గా ఉంటుంది!!

  • ఇప్పుడు చపాతీ పీట మీద కొద్దిగా పొడిపిండి చల్లుకొని దానిపై పిండి ఉండను ఉంచి చపాతీ రోలర్ సహాయంతో వీలైనంత మేర పల్చగా వత్తుకోవాలి.
  • ఆ తర్వాత వత్తుకున్న చపాతీపై ఒక టీస్పూన్ ఆయిల్ వేసి చేతితో మొత్తం రాయాలి. ఆపై దాన్ని ఒక సైడ్ నుంచి మధ్యకు ఫోల్డ్ చేయాలి. తర్వాత మరో సైడ్ నుంచి మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఆయిల్ అద్దుకుంటూ చిన్న స్క్వేర్ షేప్​​ మాదిరిగా మడుచుకోవాలి.
  • ఇప్పుడు మడతేసిన పిండి ముద్దను పొడి పిండితో కాకుండా కాస్త ఆయిల్ వేసుకొని చపాతీ రోలర్​తో ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా వీలైనంత పల్చగా వత్తుకోవాలి.
  • అనంతరం స్టౌపై పాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. పాన్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే మీరు చేసుకున్న చపాతీ వేసి ఒకవైపు కాలనివ్వాలి. పైన కాస్త బుడగలు వచ్చి పొంగే వరకు కాల్చుకోవాలి.
  • అప్పుడు దాన్ని ఫ్లిప్ చేసి పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మరో వైపు కాల్చుకోవాలి. అలా కాల్చుకునేటప్పుడు చపాతీ అనేది పొంగాలి. అప్పుడే మడతల్లోని పిండి మంచిగా కుక్ అవుతుంది.
  • ఇలా పొంగాక మళ్లీ మొదటి వైపునకు టర్న్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. అయితే, కాల్చుకునేటప్పుడు అంచులను గరిటెతో వత్తుతూ కాల్చుకోవాలి. అప్పుడే చపాతీ చక్కగా పొంగుతుంది లోపల మంచిగా కాలుతుంది.
  • అయితే, ఈ పొరల చపాతీలకు కాస్త ఆయిల్ తక్కువైతే వేడిగా ఉన్నప్పుడు సాఫ్ట్​గా ఉండి చల్లారిన తర్వాత స్టిఫ్ అయిపోతాయనే విషయం గుర్తుంచుకోవాలి.
  • కాబట్టి తగినంత ఆయిల్ వేసుకుంటూ రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్నాక వాటిని హాట్ బాక్స్​లో నిల్వ చేసుకున్నారంటే గంటల తరబడి కూడా సూపర్ సాఫ్ట్​గా ఉంటాయి ఈ పొరల చపాతీ! మరి, ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈసారి చపాతీ చేసుకునేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవుతూ చేసుకోండి.

చపాతీలు పూరీలా ఉబ్బుతూ, మెత్తగా రావాలా? - ఈ టిప్స్ పాటిస్తే చాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.