అనంత్ అంబానీ పెళ్లిలో టాలీవుడ్ హీరోల సందడి - ఎవరొచ్చారంటే?
Published : Jul 13, 2024, 3:48 PM IST
Tollywood Heros at Anant Ambani Wedding :గత కొంతకాలంగా ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం రాత్రి అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహ తంతు ముగిసింది. ఈ వేడుకకు దేశ విదేశాల తారలు తరలి వచ్చారు. సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చి ఆటపాటలతో సందడి చేశారు. అయితే ఈ వేడుకలో బాలీవుడ్ నుంచి మాత్రమే కాకుండా సౌత్ నుంచి కుడా చాలా మంది హాజరయ్యారు. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీతో పాటు రామ్చరణ్ - ఉపాసన దంపతులు హాజరయ్యారు. అలాగే రానా దగ్గుబాటి, విక్టరీ వెంకటేశ్, అక్కినేని అఖిల్ కూడా వేడుకలో కనిపించారు. కోలీవుడ్ నుంచి రజనీ కాంత్, సూర్య ఫ్యామిలీ, కన్నడ నుంచి రష్మిక సహా మరికొందరు సెలబ్రిటీలు హాజరయ్యారు.