ETV Bharat / state

సాయం అందలే సారూ - వరద పరిహారం కోసం బాధితుల నిరీక్షణ - Khammam Flood Victims - KHAMMAM FLOOD VICTIMS

Floods in Khammam : వరద విలయంతో సర్వం కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న వరద బాధితులు కష్టాలు అన్ని ఇన్ని కావు. చేతిలో చిల్లిగవ్వ లేక ఆపన్నహస్తం కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. బాధితులకు తక్షణ సాయంగా ప్రభుత్వం ప్రకటించిన రూ.16.500 పరిహారం కొంతమందికి అందని ద్రాక్షగానే మారింది. ఇరుగుపొరుగు వాళ్ల ఖాతాల్లో పరిహారం సొమ్ము జమ అయ్యిందని తెలుసుకుని, ప్రభుత్వ కార్యాలయాలకు బాధితులు పరుగులు పెడుతున్నారు. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

Floods in Khammam
TG Govt Floods Compensation (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 19, 2024, 7:50 AM IST

Updated : Sep 19, 2024, 8:20 AM IST

TG Govt Floods Compensation : గత నెల ఆగస్టు 30, 31న ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో వచ్చిన ఉపద్రవం ఊహించలేనిది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ముంచెత్తిన వరదలతో వేలాది ఇళ్లు మునిగిపోయి సర్వం కోల్పోయారు. ఇంట్లో విలువైన సామాగ్రి కొట్టుకుపోయి ఒక్కో కుటుంబానికి లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. ప్రధానంగా ఖమ్మం నగరంలోని దాదాపు 15 కాలనీలు, ఖమ్మం గ్రామీణం మండలంలోని మున్నేరు, ఆకేరు ప్రభావిత ప్రాంతాలు, తిరుమలాయపాలెం మండలంలోని రాకాసితండా, కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో వేలాది కుటుంబాలకు వరదలు తీవ్ర నష్టం మిగిల్చాయి.

బాధిత కుటుంబాల గుర్తింపు : వరద బాధితులకు తక్షణ సాయంగా ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 16 వేల 500 రూపాయలు చొప్పున పరిహారం ప్రకటించింది. ఖమ్మం నగరంలోని డివిజన్లతో పాటు గ్రామాల వారీగా పరిహారం అందించేందుకు సర్వే నిర్వహించారు. బాధిత కుటుంబాల నుంచి వివరాలు సేకరించారు. ఈ మేరకు జిల్లాలో మొత్తం 15 వేల 258 బాధిత కుటుంబాలను గుర్తించారు. ఇందులో ప్రధానంగా 10 వేల కుటుంబాలు ఖమ్మం నగరంలోనే నష్టపోగా, మిగతా 5 వేల మంది బాధితులు ఇతర మండలాల్లో ఉన్నారు.

పరిహారం కోసం ఎదురచూపులు : వారి ఖాతాల్లో పది రోజులుగా పరిహారం సొమ్ము జమ అవుతోంది. అయితే ఇప్పటి వరకు దాదాపు 14 వేల 206 మంది ఖాతాల్లో 23 కోట్లకు పైగా జమ చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంకా సుమారుగా 1000 మందికి మాత్రమే అందాల్సి ఉందని చెబుతున్నారు. ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయం, పట్టణ, గ్రామీణం మండలాల్లోని రెవెన్యూ కార్యాలయాలకు బాధితులు పోటెత్తుతున్నారు. తమకు ప్రభుత్వ పరిహారం అందలేదంటూ అధికారుల వద్ద మొరపెట్టుకుంటున్నారు.

సర్వేలో తమ కుటుంబ వివరాలు నమోదు చేసినా ఇంకా పరిహారం అందలేదని కొందరు, అసలు తమ పేర్లే నమోదు చేసుకోలేదని మరికొందరు కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. సర్వేకు వెళ్లిన సమయంలో బాధితులు ఇళ్ల వద్ద లేకపోవడం, బ్యాంకు ఖాతా పుస్తకాలు ఇవ్వకపోవడం, ఇళ్లు మునిగిన ఫోటోలు లేకపోవడం, ఇంకా కొన్ని సాంకేతిక కారణాలతో పరిహారం సొమ్ము అందలేదు. ఇక అద్దె ఇళ్లల్లో ఉన్న వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది.

"పరిహారం కోసం ఇంటికి వచ్చి సర్వే చేశారు. ఫోన్ నెంబర్, బ్యాంకు ఖాతా నెంబర్లు తీసుకున్నప్పటికీ మా ఖాతాల్లో పరిహారం సొమ్ము జమ కాలేదు. వరదల్లో మునిగి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన మాకు పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము." - వరద బాధితులు, ఖమ్మం

ఈ నేపథ్యంలో పరిహారం అందని వారి నుంచి మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తున్నామని నగర కమిషనర్ అభిషేక్ అగస్త్య తెలిపారు. ఇందుకోసం నగరపాలక సంస్థలో మూడు రోజులపాటు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశామన్నారు. పరిహారం కోసం ఇంటికి వచ్చి సర్వే చేశారని, ఫోన్ నెంబర్, బ్యాంకు ఖాతా నెంబర్లు తీసుకున్నా.. తమ ఖాతాల్లో పరిహారం సొమ్ము జమ కాలేదని కొందరు బాధితులు చెబుతున్నారు. వరదల్లో మునిగి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన తామందరికీ పరిహారం అందేలా చూడాలని వరద బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

పరిహారం అందని వారి నుంచి మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తున్నాము. ఇందుకోసం నగరపాలక సంస్థలో మూడు రోజులపాటు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశాము. ఇప్పటివరకు 600 కుటుంబాల వరకు గుర్తించాము. వారందరికీ పరిహారం అందిస్తాం. - అభిషేక్ అగస్త్య, మున్సిపల్‌ కమిషనర్‌

పచ్చని పొలాల్లో ఇసుక మేటలు - కర్షకుల కళ్లల్లో కన్నీటి ఊటలు - Sand Dunes in Crop Lands

మున్నేరు వరదలకు బురదపాలైన విలువైన పత్రాలు - వివరాలు సేకరిస్తున్న జిల్లా యంత్రాంగం - Flood Victims Problems In Khammam

Last Updated : Sep 19, 2024, 8:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.