Prabhas Hanu Raghavapudi Movie : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి రాబోయే సినిమాల్లో 'ఫౌజీ' కూడా ఒకటి. ప్రస్తుతం రాజాసాబ్‌ను త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న డార్లింగ్, రీసెంట్గా సీతారాం ఫేమ్ హను రాఘవపూడితో ఓ మూవీని ఓకే చేశారు. ఆ సినిమా పేరే ఫౌజీ. అఫీషియల్‌గా కూడా ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛ్ అయింది.
Prabhas Fauji : ఈ మూవీ వార్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్ డ్రామా లవ్ స్టోరీగా రానుంది. 1940ల కాలం నేపథ్యంలో సాగే వార్ సినిమా ఇది. చారిత్రక అంశాలతో ముడిపడి ఉన్న ఫిక్షనల్ కథాంశంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నారని సమాచారం. హీరోయిన్‌గా కొత్త అమ్మాయి, ఇన్‌స్టా ఫేమస్ ఇమాన్విని నటించనుంది. ఈమెను మూవీ లాంఛ్ సమయంలోనే పరిచయం చేశారు మేకర్స్.
అయితే తాజాగా సినిమాకు సంబంధించి మరో సమాచారం అందింది. ఈ మూవీలో మరో హీరోయిన్ కూడా ఉండబోతుందట. ఆమె పాత్ర కూడా చిత్రంలో కీలకంగా ఉంటుందని తెలిసింది. ఇప్పటికే సెకండ్ హీరోయిన్ను ఎంపిక చేసేశారని, సరైన సందర్భం చూసి మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారని టాక్ వినిపిస్తోంది.
మరి నిజంగానే ఫౌజీలో ఇద్దరు ముద్దుగుమ్మలు నటిస్తున్నారా? రెండో హీరోయిన్ ఎంపిక పూర్తైపోయిందా లేదా అనేది పక్కాగా తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.
ఈ పాన్ ఇండియా సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఆధిపత్యం కోసం యుద్ధాలు జరుగుతున్న సమయంలో ఒక యోధుడు పోరాటానికి కొత్త అర్థం చెప్పాడు. అదేంటన్నదే ఈ చిత్ర ఇతివృత్తం అని చిత్ర వర్గాలు తెలిపాయి. చిత్రంలో ప్రభాస్‌తో పాటు మిథున్ చక్రవర్తి, జయప్రద తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. కూర్పు - కోటగిరి వెంకటేశ్వరరావు, ప్రొడక్షన్ డిజైనర్ - రామకృష్ణ, మోనిక, ఛాయాగ్రహణం - సుదీప్ ఛటర్జీ అందిస్తున్నారు.
The DAWN of an Epic Saga Of War, Justice and Beyond ❤️🔥#PrabhasHanu begins with an auspicious pooja ceremony ✨
— Mythri Movie Makers (@MythriOfficial) August 17, 2024
Shoot commences soon.
Rebel Star #Prabhas @hanurpudi #Imanvi #MithunChakraborty #JayaPrada @Composer_Vishal @sudeepdop #KamalaKannan #KotagiriVenkateswaraRao… pic.twitter.com/yMRB76a9C9
'గేమ్ ఛేంజర్' రిలీజ్ డేట్ - క్లారిటీ ఇచ్చిన తమన్ - Game Changer Release Date
'దేవర' ఖాతాలో మరో సూపర్ రికార్డు - ఆ విషయంలో తొలి తెలుగు సినిమాగా ఘనత - Devara Movie Record