ETV Bharat / state

ఎప్పుడైనా తెలంగాణ సర్వపిండి తిన్నారా! తింటే వదిలిపెట్టరు - పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు - telangana sarvapindi making telugu - TELANGANA SARVAPINDI MAKING TELUGU

SarvaPindi Recipe Making in Telugu : ఎప్పుడైనా తెలంగాణ సర్వపిండిని రుచి చూశారా? ఒక్కసారి తింటే వదిలిపెట్టరు సుమా! ఇంత రుచికరమైన సర్వపిండిని కేవలం పదే పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. అదెలాగో చూసేయండి.

SarvaPindi Recipe
SarvaPindi Recipe Making in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 18, 2024, 7:49 PM IST

Telangana Special SarvaPindi Recipe Making : తెలంగాణ స్పెషల్​ వంటకాల్లో సర్వపిండికి ప్రత్యేకమైన స్థానం ఉంది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా అందరూ దీనిని ఇష్టంగా. ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని ప్రాంతాల్లో సర్వపిండిని ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇంకా చెప్పాలంటే బయట నుంచి వచ్చిన ఆహార ప్రియులైతే సర్వపిండి గురించి ప్రత్యేకంగా తెలుసుకొని, అది దొరికే ప్రాంతానికి వెళ్లి ఇష్టంతో తింటారు. ఇలా అందరి మనసు దోచుకున్న సర్వపిండిని మీ ఇంట్లో కూడా తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది చూసేయండి.

సర్వపిండి తయారీకి కావాల్సిన పదార్థాలు :

  • ఒక కప్పు బియ్యపు పిండి
  • కొద్దిగా కొత్త మీర
  • కొద్దిగా సన్నగా తరిగిన కరివేపాకు
  • ఒకటిన్నర టీ స్పూన్​ నువ్వులు
  • ఒక టీ స్పూన్​ కారం
  • చిటికెడు పసుపు
  • రుచికి సరిపడా ఉప్పు
  • కొద్దిగా శనగ పప్పు (అరగంట నానపెట్టి ఉంచుకోవాలి)
  • 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు
  • అర టీ స్పూన్​ జీలకర్ర
  • ఒక టీ స్పూన్​ ధనియాలు (వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు మూడింటిని మరీ మెత్తగా కాకుండా గ్రైండ్​ చేసుకోవాలి)
  • సన్నగా కట్​ చేసిన ఒక ఉల్లిపాయ

తయారు చేసుకునే విధానం : ముందుగా ఎన్ని సర్వపిండిలను చేయాలనుకుంటున్నామో అంచనా ప్రకారం బియ్యం పిండిని ఒక బౌల్​లోకి తీసుకోవాలి. నానబెట్టిన శనగపప్పును ఆ పిండిలో వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర తురుము, నువ్వులు, కారం, ఉప్పు, పసుపు కూడా ఆ పిండిలో కలుపుకోవాలి. తర్వాత ముందుగా గ్రైండ్​ చేసి ఉంచిన వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర మిశ్రమాన్ని పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ బాగా కలిసేలా మిక్స్​ చేయాలి. అనంతరం కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుతూ పూరీ పిండిలా వచ్చేంతవరకూ కలుపుకోవాలి. నీళ్లు ఎక్కువగా కలపకూడదు. ఎందుకంటే సర్వపిండి సరిగ్గా కాలదు. పైగా ఎక్కువగా నూనె పీల్చుకుంటుంది.

ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని దానికి పూర్తిగా ఆయిల్​ రాయాలి. ఇలా చేయడం వల్ల పిండి కడాయికి అతుక్కుపోదు. ఇప్పుడు ఆ పిండిని కడాయిలో జొన్నరొట్టే చేసినట్లు చేతులతో మెత్తగా గుండ్రంగా, పల్చగా వచ్చేట్లు చేయాలి. అలా చేసిన ఆ రొట్టెలో మధ్యలో వేలితో చిన్న చిన్న రంధ్రాలు చేయాలి. తర్వాత ఆ రంధ్రాల్లో చుక్కలు చుక్కలుగా నూనె వేసుకోవాలి. ఇలా చేస్తే అంతటా ఒకేలా ఉడుకుతుంది. తర్వాత మళ్లీ రొట్టె అంచుల్లోనూ మరీ ఎక్కువ కాకుండా చిలకరించినట్లుగా కాస్త ఆయిల్ వేయాలి. ఇప్పుడు కడాయి స్టవ్​పై ఉంచి తక్కువ ఫ్లేమ్​లో ఉంచాలి. ఒక పది నిమిషాలు వెయిట్​ చేసి తర్వాత మూత తీసి చూస్తే సర్వపిండి రెడీ!.

గమనిక : కొంతమంది రెండు వైపులా కాలినదాన్నే ఇష్టపడతారు. అలాంటివారు సర్వపిండిని తిప్పి ఒక రెండు లేదా మూడు నిమిషాలు ఉంచితే చాలు. ఒకవైపు కాలిస్తే సర్వపిండి మెత్తగా వస్తుంది. రెండో వైపు కూడా కాలిస్తే క్రిప్సీగా వచ్చి కరకరమని అంటుంది. ఎవరికి ఏది ఇష్టమైతే ఆ పద్ధతినే ఫాలో కావచ్చు.

నోరూరించే 'వంకాయ టమాట పచ్చడి' - ఇలా ప్రిపేర్ చేశారంటే టేస్ట్​ అదుర్స్​! - Brinjal Tomato Chutney

బ్రెడ్​తో ఇలా చిటికెలో బజ్జీలు చేయండి - పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు! - How to Make Egg Bread Bajji Recipe

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.