30 రోజుల్లో యాదాద్రి హుండీ ఆదాయం రూ.2.66 కోట్లు - Yadadri Hundi Collection - YADADRI HUNDI COLLECTION
Published : Aug 7, 2024, 6:35 PM IST
Yadadri Hundi Collects RS 2.66 Crore within Thirty Days : యాదాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో హుండీ కానుకలను ఇవాళ లెక్కించారు. కొండకింద ఆధ్యాత్మిక వాడలోని శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో ఈ లెక్కింపు జరిగింది. గత 30 రోజుల్లో స్వామి వారి హుండీ ఆదాయం రూ.2 కోట్ల 66 లక్షల 68,787లుగా తెలిపారు. వీటితో పాటు 87 గ్రాముల బంగారం, 3 కిలోల 300 గ్రాముల వెండి కూడా వచ్చినట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు.
స్వామివారికి వచ్చిన ఆదాయంలో విదేశీ కరెన్సీ కూడా ఉంది. విదేశాల నుంచి వచ్చిన స్థానిక భక్తులతో పాటు విదేశీ భక్తులు కూడా భారీగా స్వామివారికి కానుకలు సమర్పించారు. ఇందులో అత్యధికంగా 1354 అమెరికా డాలర్లు వచ్చాయి. వీటితో పాటు యూఏఈ దిర్హమ్స్, సౌదీ అరేబియన్ రియల్, ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడా, న్యూజిలాండ్ డాలర్స్, యూరోలతో పాటు ఇంకా పలు దేశాల కరెన్సీ వచ్చింది.