తెలంగాణ

telangana

ETV Bharat / videos

'వీరాంజనేయులు విహారయాత్ర'- అస్తికల చెంబుతో మూవీ టీమ్ విన్నూత్న ప్రమోషన్స్ - Veeranjaneyulu Vihara Yatra - VEERANJANEYULU VIHARA YATRA

By ETV Bharat Telugu Team

Published : Jul 29, 2024, 5:56 PM IST

Veeranjaneyulu Vihara Yatra Promotions : సీనియర్ నటుడు నరేశ్‌ ప్రధాన పాత్రలో యంగ్ డైరెక్టర్ అనురాగ్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ 'వీరాంజనేయులు విహారయాత్ర'. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఈటీవీ విన్‌ వేదికగా ఆగస్టు 14న విడుదలై  స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది.  అయితే ఈ చిత్రం విడుదలకు ముందే విన్నూత్నమైన ప్రమోషనల్ ఈవెంట్స్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇటీవలే తమ చిత్రాన్ని ప్రేక్షకులకు మరింత చేరువు చేసేందుకు మూవీ టీమ్‌ స్పెషల్ ప్రమోషన్స్ ప్లాన్ చేసింది. అందులో భాగంగా హైదరాబాద్‌లో సందడి చేసింది. సినిమాలో ఉపయోగించిన వాహనం, అలాగే దానిపై ఓ అస్తికల చెంబును ఉంచి నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో తిరిగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్, గచ్చిబౌలిలోని డీఎల్ఎఫ్ సెంటర్లతో పాటు పలు ప్రాంతాల్లో విహారయాత్ర చేస్తూ మూవీటీమ్‌ ఆకట్టుకుంది.

అక్కడక్కడ ఆగి, తమ సిినిమా గురించి చెప్తూ అభిమానుల చేతిలో అస్తికల చెంబును పెట్టి ప్రమోట్ చేశారు హీరో రాగ్‌ మయూర్.  ఆగస్టు 14న విడుదల కానున్న తమ చిత్రాన్ని వీక్షించాలంటూ కోరుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రమోషన్స్ నగర వాసులతో పాటు నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details