మార్కెట్లో ఫోన్ కొట్టేస్తూ అడ్డంగా దొరికిపోయిన దొంగ - పోల్‌కు కట్టేసి చితకబాదిన వ్యాపారస్థులు - Traders Caught Mobile thief - TRADERS CAUGHT MOBILE THIEF
Published : Jun 22, 2024, 2:02 PM IST
|Updated : Jun 22, 2024, 2:38 PM IST
Traders Caught Mobile Thief and Crushed in Karimnagar : కరీంనగర్‌లోని రైతు బజార్లో సెల్‌ఫోన్ చోరీ చేస్తున్న ఓ దొంగను కూరగాయల వ్యాపారులు కట్టేసి చితకబాదారు. రైతు బజార్లో ప్రతి శనివారం కూరగాయల కోసం వచ్చే వారి నుంచి సెల్ఫోన్లు పోవడంతో విక్రయదారులు బెంబేలెత్తుతున్నారు. రూ.50 వేలు విలువ చేసే మొబైల్‌లను టార్గెట్ చేసుకొని దొంగలు సెల్ ఫోన్లను చాకచక్యంగా దొంగిలిస్తున్నారు. ఈరోజు రైతు బజార్లో సెల్ ఫోను దొంగిలించే ప్రయత్నంలో వ్యాపారస్థులు ఓ దొంగను పట్టుకున్నారు.
Traders Beat Mobile Thief at Market Video : దొరికిన దొంగను పోలుకు కట్టేసి కూరగాయల వ్యాపారస్థులు చితకబాదారు. మహారాష్ట్ర, నాగపూర్ నుంచి వచ్చిన నలుగురు పథకం వేసి సెల్ఫోన్లను దొంగలిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో సెల్‌ఫోన్‌ను దొంగిలించే దొంగను పట్టుకొని స్థానికులు చితకబాదారు. ప్రతి శనివారం పదుల సంఖ్యలో సెల్ఫోన్లు పోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా తమ సమస్యకు పరిష్కారం దొరకలేదని బాధితులు ఆందోళన చెందుతున్నారు.