తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : ముఖ్యమంత్రుల సమావేశంపై మంత్రుల ప్రెస్​మీట్ - Telugu States CMs Meeting Points - TELUGU STATES CMS MEETING POINTS

By ETV Bharat Telangana Team

Published : Jul 6, 2024, 9:06 PM IST

Updated : Jul 6, 2024, 9:41 PM IST

Telugu States CMs Meeting Points Live : తెలంగాణ ప్రజాభవన్ వేదికగా సాగిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక భేటీ ముగిసింది. విభజన అంశాల వివాదాల పరిష్కారమే లక్ష్యంగా సమావేశమైన సీఎంల చర్చలు విజయవంతమయ్యాయి. ఇరు రాష్ట్రాల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రులు రేవంత్​రెడ్డి, చంద్రబాబు నాయుడు సమాలోచనలు జరిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ జరిగి పదేళ్ల కాలం గడిచినా, నాటి నుంచి కీలకాంశాలు ఎన్నో పెండింగ్‌లో ఉండిపోయాయి. అధికారుల స్థాయిలో కొన్నిసార్లు చర్చలు జరిగినా చాలా విషయాలు కొలిక్కి రాకుండా అలానే పెండింగ్​లో ఉన్న ఎన్నో అంశాలపై కూలంకషంగా మాట్లాడారు. ఈ క్రమంలోనే ఇరువురు సీఎంల ఉమ్మడిగా ఎజెండా అంశాలను ఖరారు చేశారు. ప్రధానంగా విభజన చట్టం షెడ్యూల్‌ 9, 10లోని సంస్థల ఆస్తుల విభజన, ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశం, విద్యుత్ సంస్థలకు చెల్లించవలసిన బకాయిలు, 15 ఎయిడెడ్ ప్రాజెక్టుల రుణ పంపకాలు, ఏపీ, తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగుల మార్పిడిపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం భేటీ కీలక విషయాలను మంత్రులు వివరిస్తున్నారు. 
Last Updated : Jul 6, 2024, 9:41 PM IST

ABOUT THE AUTHOR

...view details