LIVE : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు - Telangana Assembly Sessions Live - TELANGANA ASSEMBLY SESSIONS LIVE
Published : Jul 24, 2024, 10:05 AM IST
|Updated : Jul 24, 2024, 5:31 PM IST
Telangana Assembly Sessions 2024 Live : రాష్ట్ర శాసనసభ సమావేశాలు రెండోరోజు ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో మొదట ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరుగుతోంది. శాసన సభ్యులు అడిగే ప్రశ్నలకు ఆయా శాఖలకు చెందిన మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి చూపించడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు సూచించారు. బీఏసీలో తీసుకున్న నిర్ణయాలను సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడిస్తున్నారు. ఆ తర్వాత 2022- 23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ వార్షిక నివేదికలను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సభ ముందు ఉంచుతారు. తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ నాల్గొవ, అయిదవ, ఆరవ వార్షిక నివేదికలను శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు సభ ముందు ఉంచుతారు.
Last Updated : Jul 24, 2024, 5:31 PM IST