తెలంగాణ

telangana

ETV Bharat / videos

చుట్టూ శునకాలు - అరచేతిలో ప్రాణాలు - ఆ వృద్ధురాలు ఏం చేసిందంటే? - Street Dogs Attack Old Woman - STREET DOGS ATTACK OLD WOMAN

By ETV Bharat Telangana Team

Published : Jun 23, 2024, 3:44 PM IST

Updated : Jun 23, 2024, 4:41 PM IST

Street Dogs Attacked Old Woman In Nirmal : నిర్మల్‌ జిల్లాలో కుక్కల బెడద ఎక్కువైందని, వాటి బారి నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ఇటీవల ఓ వృద్ధురాలు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా ఒక్కసారిగా కుక్కలు దాడికి దిగాయి. దీంతో వాటిని ఆమె తరిమింది. వెళ్లినట్లు వెళ్లి ఆమెపై దాడి చేయటానికి రాగా, ఆ వృద్ధురాలు పరుగులు తీయడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు కావడంతో వాటిని మున్సిపల్‌ కమిషనర్‌కు స్థానికులు చూపించారు. మున్సిపల్ అధికారులు స్పందించి జిల్లా కేంద్రంలో శునకాలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 

అయితే ఈ మధ్యకాలంలో వీధి శునకాల దాడులు పెరుగుతున్నాయి. కొన్నిసార్లు ప్రాణాలూ పోతున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు కుక్క కాటుకు బలైపోతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నా, అధికారులు చర్యలు చేపట్టడం లేదని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. 

Last Updated : Jun 23, 2024, 4:41 PM IST

ABOUT THE AUTHOR

...view details