తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE: బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామోజీ రావు సంస్మరణ సభ - RAMOJI RAO MEMRIAL SERVICE LIVE - RAMOJI RAO MEMRIAL SERVICE LIVE

By ETV Bharat Telangana Team

Published : Jun 30, 2024, 8:44 AM IST

Updated : Jun 30, 2024, 9:13 AM IST

Ramoji Rao Memorial Service at Botanical garden walkers association live: హైదరాబాద్ లోని కొండాపూర్ బొటానికల్ గార్డెన్​లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీ రావు సంస్మరణ సభ  ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా సినీ నటుడు మురళీ మోహన్, పద్మశ్రీ సోమరాజు, ఎంఎల్ఏ రఘురామకృష్ణరాజు, పద్య కవయిత్రి  కుసుమ తదితరులు పాల్గొన్నారు. వ్యక్తిగా రామోజీ రావ్ జీవిత ప్రయాణం అందరికీ ఆదర్శమని వక్తలు పేర్కొన్నారు. ఈనాడు సంస్థలను స్థాపించి ఎంతో మందికి జీవితాన్నిచిన మహానీయ వ్యక్తి అని వెల్లడించారు. రామోజీ రావు సామాన్య కుటుంబం నుంచి వచ్చిన గొప్ప వ్యక్తి అని తెలిపారు. రామోజీ అంటేనే ఒక బ్రాండ్, ఏ వ్యాపారం చేసినా ప్రజాహితం కోసం చేసేవారని వెల్లడించారు. 150 దేశాలకు ప్రియ పచ్చళ్ళు వెళుతున్నాయని ఇదంతా రామోజీ రావు దార్శనికత వల్లే అని తెలిపారు. సామాన్యుడి కష్టం వార్త అని చెప్పిన వ్యక్తి రామోజీ రావు గుర్తు చేసుకన్నారు. ఆయన చేసిన గొప్ప పనులు ప్రజాహితమైన పనుల వల్లే నేడు ఎంతో మంది స్మరించుకుంటున్నారని తెలిపారు. 
Last Updated : Jun 30, 2024, 9:13 AM IST

ABOUT THE AUTHOR

...view details