జలపాతంలో పడి ఒకే కుటుంబంలో ఐదుగురు గల్లంతు- లైవ్ వీడియో - Pune Bhushi Dam Incident - PUNE BHUSHI DAM INCIDENT
Published : Jul 1, 2024, 11:32 AM IST
Pune Bhushi Dam Incident : మహారాష్ట్ర పుణెలోని లోనావాలాలో భూషీ డ్యామ్ సమీపంలోని జలపాతం సందర్శనకు వచ్చిన ఓ కుటుంబానికి తీరని విషాదం మిగిలింది. జలపాతంలో ప్రమాదవశాత్తు గల్లంతై ఆ కుటుంబంలోని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక మహిళ, ముగ్గురు బాలికలు, ఓ బాలుడు ఉన్నారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. మహిళ, ఇద్దరు బాలికల మృతదేహాలను వెలికి తీశాయి. మిగతా ఇద్దరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి.
ఇదీ జరిగింది
ఆదివారం జలపాతం వద్ద ఐదుగురు రాళ్లపై నిలబడి ఎగువ నుంచి వస్తున్న నీటిని చూస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఒక్కసారిగా జలపాతం ఉద్దృతి పెరిగి ఐదుగురు కొట్టుకుపోయారు. వారిని కాపాడేందుకు అక్కడే ఉన్న కొందరు పర్యటకులు వారిని కాపాడేందుకు యత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. నీటి ప్రవాహం అంతకంతకూ పెరిగి అందరూ చూస్తుండగానే ఐదుగురు గల్లంతయ్యారు. వెంటనే గాలింపు చేపట్టిన సహాయ బృందాలు జలాశయం దిగువ భాగంలో నలుగురు మృతదేహాలను వెలికి తీశాయి. షాహిష్ట లియాఖత్ అన్సారీ(36), అమీమా అదిల్ అన్సారీ(13), ఉమేరా ఆదిల్ అన్సారీ(8)గా పోలీసులు గుర్తించారు. మిగిలిన ఇద్దరు పిల్లలు అద్నాద్ అన్సారీ(4), మరియా అన్సారీ(8) కోసం గాలింపు కొనసాగుతోంది. ఆదివారం రాత్రి చీకటి పడడం వల్ల గాలింపు నిలిపివేసిన సహాయ సిబ్బంది సోమవారం ఉదయాన్నే స్పీడ్ బోట్‌ల సాయంతో జలాశయం దిగువ భాగంలో గాలింపు చేపట్టారు. పుణె సమీపంలోని సయ్యద్ నగర్‌కు చెందిన 16-17మంది కుటుంబ సభ్యులు కలిసి ఒక ప్రైవేటు బస్సులో లోనావాలకు సరాదాగా గడిపేందుకు వెళ్లారు. వారిలో అన్సారీ కుటుంబ సభ్యులు భూషి డామ్ సమీపంలోని జలపాతం వద్దకు వెళ్లి ఉద్దృతిలో కొట్టుకుపోయారు