High Power Bill Issue At Yadadri Bhuvanagiri : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పురపాలక పరిధిలోని ఒక బోరు మోటారు బిల్లు అక్షరాల రూ.8,26,963 వచ్చింది. ఖాజీమహెల్లా ఆవాస ప్రాంతంలోని సర్వీస్ నెంబర్ 6301419833కు జనవరి నెల బిల్లు రూ.56,526 రావడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ బోరు మోటారు బిల్లు ప్రతి నెలా రూ.70 వేల నుంచి రూ.75 వేలలోపు వస్తుందని పురపాలక అధికారులు చెబుతున్నారు. గత కొన్ని నెలలుగా ఈ బిల్లును నెలనెలా చెల్లించకపోవడం వల్ల ఈ కనెక్షన్‌పై రూ.8,26,963 బిల్లు బకాయి ఉంది.
Current Bill Issue in Bhuvanagiri : బోరు మోటారును ఆవాస ప్రాంతంలోని ప్రజలు 24 గంటల పాటు వినియోగిస్తున్నట్లుగా తెలిసింది. బిల్లు నియంత్రణలో భాగంగా గత నెల రాత్రి వేళల్లో మోటారు నడపకపోవడంతో జనవరి నెల కరెంటు బిల్లు కొంత మేర తగ్గి వచ్చింది. అయినప్పటికీ ఒక్క బోరు మోటారు బిల్లే ఏకంగా రూ.56,526 రావడం ఏంటని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని నీటి సరఫరా వీధి దీపాలకు సంబంధించి 327 విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. వీటన్నింటిలో ఈ బోరు మోటారు బిల్లు అధికంగా రావడం గమనార్హం. నెలనెలా మున్సిపాలిటి రూ.16 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు విద్యుత్తు శాఖకు బిల్లును చెల్లిస్తుండటం గమనార్హం.
చలికాలంలోను చెమట పట్టించిన విద్యుత్ బిల్లు.. మూడుకోట్ల పైనే కట్టాలట