ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించాలనుకుంటున్నారా? - గుడ్న్యూస్ చెప్పిన దిల్ రాజు - PRODUCER DILRAJU DREAMS
Published : Nov 11, 2024, 8:50 PM IST
Dilraju Dreams : ప్రపంచ స్థాయిలో గౌరవాన్ని దక్కించుకున్న తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొత్త నటీనటులు, దర్శక నిర్మాతలను ప్రొత్సహించడంతో పాటు ఫెయిల్యూర్స్ను తగ్గించేందుకు తన వంతు కార్యచరణ సిద్ధం చేసినట్లు ప్రముఖ నిర్మాత దిల్రాజు తెలిపారు. నష్టనివారణ చర్యల్లో భాగంగా స్క్రిప్ట్ దశ నుంచే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి పక్కాగా పట్టాలెక్కించేందుకు దిల్రాజు డ్రీమ్స్ పేరుతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు దిల్రాజు ప్రకటించారు. ఆ వ్యవస్థ ద్వారా ఏడాదికి ఐదు చిత్రాలను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపిన దిల్రాజు, ఇందుకోసం ప్రత్యేక వెబ్సైట్ను డిసెంబర్ లేదా జనవరిలో భారీ స్థాయిలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఔత్సాహిక దర్శక నిర్మాతలు, నటీనటుల, కథారచయితలు దిల్రాజు డ్రీమ్స్ ప్రతినిధులను సంప్రదించి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చని సూచించారు. దిల్రాజు డ్రీమ్స్ కోసం వారంలో ఒకరోజు తాను పూర్తి స్థాయి సమయాన్ని కేటాయిస్తానని, సినీపరిశ్రమ మేలు కోసం తనవంతు బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.