తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోదీ బహిరంగ సభ - ప్రత్యక్షప్రసారం - PM MODI HYDERABAD MEETING LIVE - PM MODI HYDERABAD MEETING LIVE

By ETV Bharat Telangana Team

Published : May 10, 2024, 4:57 PM IST

Updated : May 10, 2024, 6:38 PM IST

PM Modi Public Meeting in Hyderabad Live : రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. నేడు ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ పరిధిలోని నారాయణపేటలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. మధ్యాహ్నం 3 గంటలకు కర్ణాటకలోని కలబురిగిలో ఎన్నికల ప్రచారం ముగించుకున్న అనంతరం నారాయణపేట సభలో పాల్గొన్నారు. ఈ సభ తర్వాత హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. మోదీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్​లో ట్రాఫిక్ పోలీసులు ఎల్బీ స్టేడియం మార్గంలో ఆంక్షలు విధించారు. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
Last Updated : May 10, 2024, 6:38 PM IST

ABOUT THE AUTHOR

...view details