తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ ప్రెస్​మీట్​ - PM Modi Press Meet On Election Results - PM MODI PRESS MEET ON ELECTION RESULTS

By ETV Bharat Telangana Team

Published : Jun 4, 2024, 8:27 PM IST

Updated : Jun 4, 2024, 9:13 PM IST

Modi Press Meet Over Election Results : మోదీ సర్కార్ గత పదేళ్ల పాలనలో అనేక ఆర్థిక సంస్కరణలు చేపట్టి వ్యాపార వర్గాల ఆదరాభిమానాలు పొందింది. ముచ్చటగా మూడోసారి కూడా గెలిచి, మరిన్ని విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలు చేపట్టాలని ఆశించింది. అయితే ఇప్పుడు అదంత సులువుగా జరిగే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం బీజేపీ స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. ప్రధాని నరేంద్ర మోదీ 'అబ్ ​కీ బార్​ ఛార్​ సౌ పార్'​ అని నినాదం ఇచ్చినప్పటికీ అది నెరవేరలేదు. కనీసం మ్యాజిక్ ఫిగర్ కూడా సొంతంగా రాలేదు. అందుకే ఎన్​డీఏ కూటమిలోని మిగతా మిత్రపక్షాలపై కచ్చితంగా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది పరోక్షంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి, సంస్కరణలు చేపట్టడానికి పెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉంది. భారతదేశాన్ని గ్లోబల్ మాన్యుఫ్యాక్చురింగ్ హబ్​ (అంతర్జాతీయ తయారీ కేంద్రం)గా మార్చాలని మోదీ ప్రభుత్వం సంకల్పించింది. కానీ ఇదంతా చేయాలంటే, విధానపరమైన ఆర్థిక సంస్కరణలు చేయాల్సి ఉంటుంది. మిత్రపక్షాల మద్దతు లేకపోతే ఇది సాధ్యమయ్యే పనికాదు. ఈ క్రమంలోనే ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు.
Last Updated : Jun 4, 2024, 9:13 PM IST

ABOUT THE AUTHOR

...view details