LIVE : ఆదిలాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన - ప్రధాని మోదీ ఆదిలాబాద్ పర్యటన
Published : Mar 4, 2024, 11:39 AM IST
|Updated : Mar 4, 2024, 12:10 PM IST
PM Modi Adilabad Tour Live Today : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ రాష్ట్రానికి వచ్చారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మహారాష్ట్రలోని నాగపూర్‌కు చేరుకున్న ప్రధాని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆదిలాబాద్ చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం మోదీ పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో 6 వేల 700 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ, జాతికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అధికారిక కార్యక్రమాల అనంతరం జరిగే బీజేపీ బహిరంగ సభలో మోదీ ఒక్కరే పాల్గొన్నారు. ఈ సభా వేదికగా ప్రధాన మంత్రి పార్లమెంటు ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఈ నేపథ్యంలో అధికారం యంత్రాంగం పటిష్ఠ చర్యలు చేపట్టింది. మోదీ పర్యటన సందర్భంగా పట్టణంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Last Updated : Mar 4, 2024, 12:10 PM IST