ETV Bharat / offbeat

కొత్తిమీరను ఇలా నిల్వ చేసుకుంటే - ఎండాకాలం కూడా ఎక్కువ రోజులు తాజాగా! - CORIANDER STORAGE TIPS

కొత్తిమీర త్వరగా వాడిపోతుందా? - ఇలా స్టోర్ చేస్తే కనీసం వారం పైనే ఫ్రెష్​గా!

TIPS TO STORE CORIANDER FRESH
Coriander Leaves (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 17, 2025, 4:42 PM IST

Tips to Store Coriander Fresh for Long Time : కొత్తిమీరను కొద్దిగా వేస్తే చాలు కూర, చారు ఏదైనా ఘుమఘుమ లాడాల్సిందే. ముఖ్యంగా నాన్​వెజ్ రెసిపీలు, బిర్యానీ వంటి వాటిల్లో ఇది తప్పనిసరిగా ఉండాల్సిందే. కొత్తిమీర వంటల రుచిని రెట్టింపు చేయడమే కాదు దీనిలోని ఔషధ గుణాలు ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. అయితే, చాలా మంది మార్కెట్​కి వెళ్లినప్పుడు వారానికి సరిపడా కొత్తిమీరను తెచ్చుకుంటుంటారు. కానీ, నిల్వ చేయడంలో పొరపాట్ల వల్ల త్వరగా పాడైపోతుంది. ఇక ఎండకాలం అయితే తెచ్చిన ఒక్కరోజుకే పూర్తిగా వాడిపోతుంది. అలాకాకుండా కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా నిల్వ ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఇప్పుడు చూద్దాం.

  • కొత్తిమీర తేగానే చాలా మంది కడిగి ఫ్రిడ్జ్​లో పెట్టేస్తారు. అలాకాకుండా కొత్తిమీర తెచ్చాక దాన్ని శుభ్రంగా కడిగి నీరు, తేమంతా పోయేలా ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్​ కిందో, గాలికో ఏమాత్రం తడిలేకుండా మంచిగా ఆరబెట్టాలి. ఆ తర్వాత కంటైనర్ లేదా ప్లాస్టిక్​ బ్యాగ్​లో ఉంచి కట్టేయాలి. ఆపై ఫ్రిడ్జ్​లో ఉంచితే కనీసం వారం, పది రోజుల పాటు తాజాగా ఉంటుందంటున్నారు నిపుణులు.
  • ఈ టిప్ ఫాలో అవ్వడం ద్వారా కూడా కొత్తిమీర త్వరగా వాడిపోకుండా జాగ్రత్తపడవచ్చు. అదేంటంటే ఒక గ్లాసులో తగినన్ని వాటర్ తీసుకొని అందులో కాడలు కట్ చేయకుండా కొత్తిమీరను వేసి నిల్వ చేసుకోవాలి.
  • కొత్తిమీర స్టోర్ చేసుకునేటప్పుడు వీలైనంత వరకు సన్​లైట్ పడని చోట నిల్వ చేసుకోవాలి. ఎందుకంటే సూర్యకాంతి పడితే త్వరగా పాడైపోతుంది. అలాగే తడిలేని ప్రదేశాల్లో ఉంచకుండా చూసుకోవాలి.
  • అదేవిధంగా, శుభ్రంగా కడిగి ఎలాంటి తడిలేకుండా ఆరబెట్టిన కొత్తిమీరను పేపర్​ బ్యాగ్​లో చుట్టి ఫ్రిడ్జ్​లో నిల్వ చేసినా ఎక్కువ రోజులు తాజాగా ఉంటుందంటున్నారు నిపుణులు.
  • కొత్తిమీరను తెచ్చాక శుభ్రంగా కడిగి పసుపు వాటర్​లో 30 నిమిషాలు నానబెట్టండి. ఆ తర్వాత ఎలాంటి తడి, తేమ లేకుండా ఫ్యాన్​ గాలికి ఆరబెట్టండి. ఆపై పేపర్ టవల్​లో చుట్టి, డబ్బాలో పెట్టండి. దీనిని ఫ్రిడ్జ్​లో స్టోర్​ చేసుకుంటే కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.

మరికొన్ని సూపర్ టిప్స్!

  • కొత్తిమీర, పుదీనా ఎక్కువ రోజులు ఫ్రెష్​గా ఉండాలంటే అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టి ఫ్రిడ్జ్​లో స్టోర్ చేసుకున్నా మంచి ఫలితం ఉంటుందంటున్నారు.
  • చాలా మంది కొత్తిమీరను వేర్లతో సహా నిల్వ చేస్తారు. దీనివల్ల వేర్లకున్న తేమ కాడలకు పాకి త్వరగా కుళ్లిపోతాయి. కాబట్టి వేర్లను, కాస్త మందంగా ఉండే కాడలను కోసేయాలి.
  • ఫ్రిడ్జ్​లో మూత లేకుండా గాలి తగిలేలా పెడితే కొత్తిమీర వడలిపోతుంది. దాని వాసన మిగతా పదార్థాలకూ పాకుతుంది. కాబట్టి ఓ పాత్రలో వేసి మూత పెట్టాలి. ఇలా నిల్వ చేసినా కొత్తిమీర చాలా రోజులు ఫ్రెష్​గా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

ఇవీ చదవండి :

ఆకుకూరలను ఇలా వండుతున్నారా? - పోషకాలన్నీ గాల్లో కలిపేస్తున్నట్టే!

టమాటాలు ఎక్కువకాలం ఫ్రెష్​గా ఉండాలా? - ఇలా చేస్తే చాలా రోజులు ఉంటాయి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.