గల్లీ నుంచి దిల్లీ దాక బీజేపీ ఉంటేనే అభివృద్ధి సాధ్యం - అర్వింద్ - BJP CANDIDATE ARVIND INTERVIEW - BJP CANDIDATE ARVIND INTERVIEW
Published : Apr 26, 2024, 1:06 PM IST
Nizamabad BJP MP Candidate Arvind Interview : నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ప్రచారం జోరందుకుంది. సమావేశాలు, సభలతో పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఛాయ్ పే చర్చ పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. లోక్‌సభ పరిధిలో వివిధ ప్రాంతాల్లో ఛాయ్ పే చర్చ నిర్వహిస్తూ స్థానికులతో మాట్లాడుతూ వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకుంటున్నారు. మోదీ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరిస్తున్నారు.
గత ఐదేళ్లలో నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులను, మళ్లీ గెలిపిస్తే చేయబోయే అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను వద్దనుకునే ప్రజలు బీజేపీని గెలిపించారని తెలిపారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోసారి మోదీకి మద్దతివ్వాలని కోరారు. తనను గెలిపించాలని నిజామాబాద్ ఓటర్లను కోరేందుకు చాయ్ పే చర్చ పేరుతో భిన్నమైన ప్రచారం చేస్తున్న ధర్మపురి అర్వింద్‌తో మా ప్రతినిధి శ్రీశైలం ముఖాముఖి.