తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు, అల్లు అరవింద్ - PRODUCERS WHO VISITED SREE TEJ

By ETV Bharat Telangana Team

Published : Dec 25, 2024, 2:39 PM IST

Updated : Dec 25, 2024, 2:48 PM IST

Movie Producers visits Sri Tej Live : సంధ్య ధియేటర్ ఘటనలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించడానికి తెలంగాణ ఫిలిం డెవలప్​మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, ప్రొడ్యూసర్ దిల్ రాజు, డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కిమ్స్‌ ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స పొందుతున్న శ్రీతేజ్​కు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. బాలుడు శ్రీతేజ్‌ తండ్రి భాస్కర్‌తో చర్చించిన దిల్ రాజు బాలుడి వైద్య ఖర్చులు కూడా భరిస్తామన్నారు. సంధ్య థియేటర్‌ ఘటన ఎవరూ కావాలని చేసింది కాదని దిల్ రాజు అభిప్రాయపడ్డారు. అది దురదృష్టకర ఘటనగా అభివర్ణించారు.బాధిత కుటుంబానికి అండగా ఉండే బాధ‌్యత తనదే అని తెలిపారు. భాస్కర్‌కు ఉపాధి కల్పించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. శ్రీతేజ్ కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్ధిస్తున్నామన్నారు. కొన్ని రోజుల క్రితం మైత్రి మూవీ క్రియేషన్స్ తరఫున నిర్మాత నవీన్, శ్రీతేజ్​ కుటుంబానికి 50 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.
Last Updated : Dec 25, 2024, 2:48 PM IST

ABOUT THE AUTHOR

...view details