LIVE: రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు - మెదక్ చర్చి శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ - CHRISTMAS CELEBRATIONS LIVE
🎬 Watch Now: Feature Video
Published : 12 hours ago
|Updated : 12 hours ago
Christmas Celebrations 2024 Live : రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రార్థనా మందిరాలను సర్వాంగ సుందరంగా విద్యుద్దీపాలతో అలంకరించారు. మంగళవారం రాత్రి 9 గంటల నుంచే 12 గంటలకు పలు కార్యక్రమాలు సామూహిక ప్రార్ధనలు చేపట్టారు. ప్రత్యేక ప్రార్ధనలతో రోజుని ప్రారంభించనున్నారు. పండగ వేళ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చర్చిలు యేసు నామస్మరణతో మార్మోగుతున్నాయి. క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు క్రైస్తవులకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి అన్ని మతాల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఆసియాలోనే రెండో పెద్దదైన మెదక్ చర్చిలో ప్రాతఃకాల ఆరాధనాతో మెదక్ చర్చిలో క్రిస్మస్ మహోత్సవం ప్రారంభమవనుంది చర్చి ఆనవాయితీ ప్రకారం శిలువను ఉరేగింపుగా తీసుకువచ్చి ప్రతిష్టాపన చేయనున్నారు. శతాబ్ది వేడుకల సందర్భంగా మెదక్ చర్చిని విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు . రంగురంగుల విద్యుద్దీపాలతో చర్చి ప్రాకారాలను, టవర్‌ను ముస్తాబు చేశారు. చిన్నపిల్లలను ఆహ్లాదపరిచేలా చర్చి ఆవరణలో రంగులరాట్నాన్ని ఏర్పాటు చేశారు.
Last Updated : 12 hours ago