LIVE : కేంద్ర బడ్జెట్‌పై ఈటీవీ భారత్ ప్రత్యేక చర్చా కార్యక్రమం - ప్రత్యక్షప్రసారం - UNION BUDGET 2025
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-02-2025/640-480-23451301-thumbnail-16x9-budget.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Feb 1, 2025, 3:00 PM IST
|Updated : Feb 1, 2025, 3:58 PM IST
Debate on Union Budget 2025 Live : రూ.12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రకటించారు. ఆదాయపన్ను విధానంలో సంస్కరణలు సరికొత్త తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ మేరకు శనివారం కేంద్ర బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. రూ.12 లక్షల వరకు వ్యక్తిగత ఇన్ కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇచ్చారు. దీంతో కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు పన్ను నుంచి మినహాయింపు ఉండనుంది. రూ.18 లక్షల వరకు ఆదాయం వచ్చేవారికి రూ.70 వేల వరకు ఆదా కానుంది చేకూరనుంది. రూ.25 లక్షల వరకు ఆదాయం వచ్చేవారు రూ.1.10 లక్షల వరకు లబ్ధి పొందనున్నారు. ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా ఎనిమిదోసారి సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా సీతారామన్ నిలిచారు. అంతకుముందు బడ్జెట్ ట్యాబ్‌తో నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపదీముర్ముతో సమావేశమై బడ్జెడ్ ట్యాబ్‌ను చూపి కాసేపు మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం మూడోదఫా అధికారంలోకి వచ్చాక తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది.
Last Updated : Feb 1, 2025, 3:58 PM IST