LIVE: రవీంద్రభారతిలో 'నట్స్ బోల్ట్స్ ఆఫ్ వార్ అండ్ పీస్' పుస్తక ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి - CM REVANTH REDDY IN BOOK LAUNCH
🎬 Watch Now: Feature Video
Published : 13 hours ago
|Updated : 12 hours ago
CM Revanth Reddy in Book launch Event : హైదరాబాద్లో అసెంబ్లీకి సమీపంలోని రవీంద్ర భారతిలో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. ఈ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్సీ కొంపల్లి యాదవ రెడ్డి రచించిన 'నట్స్ బోల్ట్స్ ఆఫ్ వార్ అండ్ పీస్' అనే పుస్తకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. రవీంద్ర భారతిలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పుస్తక రచయితలు, సీనియర్ పాత్రికేయులు హాజరయ్యారు. సమకాలిన రాజకీయ పరిస్థితులు, భౌగోళిక రాజకీయ అంశాలు, యుద్ధానికి దారితీసే పరిస్థితులను విశ్లేషిస్తూ మాజీ ఎమ్మెల్సీ కొంపల్లి యాదవ రెడ్డి ఈ పుస్తకాన్ని రచించారు. యుద్ధం ప్రభావం సామాన్యులపై ఎంత వరకు పడుతుంది, ఇందులో ప్రభుత్వం బాధ్యత ఎంత అన్న అంశాలను ప్రధానంగా చర్చించారు. రవీంద్ర భారతిలో నట్స్ బోల్ట్స్ ఆఫ్ వార్ అండ్ పీస్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించి ప్రసంగిస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని లైవ్లో చూద్దాం.
Last Updated : 12 hours ago