LIVE : కేబినెట్ మీటింగ్ వివరాలను వెల్లడిస్తున్న మంత్రులు
Published : Oct 26, 2024, 10:39 PM IST
|Updated : Oct 26, 2024, 10:55 PM IST
Ministers Reveal Details of Cabinet Meeting Live : కీలక అంశాలే అజెండాగా ఇవాళ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ప్రధానంగా జీవో 317, ఉద్యోగుల పెండింగ్ డీఏతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. బీసీ కులగణన షెడ్యూల్ సహా కొత్త ఆర్వోఆర్ బిల్లుపై కీలకం నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రివర్గం తెలిపింది. ఎకో టూరిజం పాలసీ, మూసీ పునరుజ్జీవం, హైడ్రా, ఇందిరమ్మ ఇళ్లు, భూ కేటాయింపులతో పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.భారీ అజెండాతో కూడిన అనేక అంశాలపై చర్చించి, పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కేబినెట్ ఇవాళ సమావేశం ఏర్పాటుకాగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ జరిగింది. కేబినెట్ భేటీ ఈ నెల 23న నిర్వహించాలని భావించినప్పటికీ, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావు విదేశీ పర్యటన కారణంగా ఇవాళ్టికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కాగా ఇవాళ కేబినెట్ మీటింగ్‌లోని మరిన్ని వివరాలను మంత్రులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడిస్తున్నారు.
Last Updated : Oct 26, 2024, 10:55 PM IST